ఫ్రెండ్లీ లోకేష్ : మిత్రుల మనసు గెలుచుకుంటున్నారు !
ఇక నారా లోకేష్ టీడీపీకి ఎటూ తిరుగులేని నాయకుడు. ఆయనకు చంద్రబాబు వారసుడిగా 2017 నుంచే గుర్తింపు ఉంది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో లోకేష్ తన నాయకత్వాన్ని పదిలపరచుకున్నారు.
By: Satya P | 17 March 2026 9:21 AM ISTదేశంలో ఎక్కడా లేని ఐక్యత ఏపీలో కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీతో మరో పార్టీకి ఏదో విషయంలో ఎపుడూ భేదాలు వస్తూనే ఉంటాయి. అది సహజం కూడా. నిజానికి చూస్తే ఒకే పార్టీలో వర్గ పోరు అభిప్రాయ భేదాలు వస్తున్న కాలమింది. అంతే కాదు అసంతృప్తి సెగలు చెలరేగి మీడియాకు ఎక్కుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏపీలో మాత్రం ఒక కొత్త సన్నివేశం రాజకీయంగా ఆవిష్కృతం అవుతోంది. అదే టీడీపీ నాయకత్వంలోని కూటమిలో అరుదైన ఐక్యత. టీడీపీ జనసేన బీజేపీ ఇలా మూడు పార్టీలు ఉన్నా కూడా అంతా కలసి ఒకే మాట ఒకే బాటగా ఉండడం విశేష పరిణామం అని అంటున్నారు.
ఇంట గెలిచిన లోకేష్ :
ఇక నారా లోకేష్ టీడీపీకి ఎటూ తిరుగులేని నాయకుడు. ఆయనకు చంద్రబాబు వారసుడిగా 2017 నుంచే గుర్తింపు ఉంది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో లోకేష్ తన నాయకత్వాన్ని పదిలపరచుకున్నారు. యువ గళం పాదయాత్ర ద్వారా జనాలకు చేరువ అయ్యారు. అలాగే పార్టీ జనాలకు కూడా మరింత చేరువ అయ్యారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ మరింతగా ఫోకస్ అవుతూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సారధిగా చంద్రబాబు ఉన్నా లోకేష్ ప్రాముఖ్యత కూడా ఎవరూ విస్మరించలేనిదిగా ఉంది. అంతే కాదు కూటమి మొత్తంలో 135 సీట్లు కలిగి ఉన్న టీడీపీ పెద్దన్న పాత్రలో ఉంది. సహజంగానే ఆ పార్టీ మాటే చెల్లాలి. కానీ కూటమి ధర్మాన్ని టీడీపీ కూడా అనుసరిస్తూ మిత్రులను దగ్గర చేసుకుంటోంది. ఆ విషయంలో చంద్రబాబు అడుగు జాడలలో నారా లోకేష్ కూడా నడుస్తూ కూటమి పార్టీలతో ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు.
సమస్యల మీద స్పందన :
ఇక లోకేష్ తమ ప్రభుత్వంలో ఏ సమస్య ఏర్పడినా వెంటనే పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎక్కడైనా చిన్నపాటి తప్పులు జరిగితే భేషజాలకు పోకుండా వెంటనే సరిదిద్దు కుంటున్నారు. ఇక మీడియాలో ఏ విషయం మీద అయినా సమస్యలు కనిపించినా వెంటనే లోకేష్ రియాక్ట్ కావడం కనిపిస్తోంది. లేటెస్ట్ గా మధ్యాహ్న భోజనం అంశం మీద ఒక వీడియో లో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అది తన దృష్టికి వచ్చిన వెంటనే లోకేష్ ఎంతో పాజిటివ్ గా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చాలా చొరవ చూపించారు. అలాగే ఒక జిల్లాలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని విద్యార్ధులు వాటిని వాడకుండా పారబోస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. దాని మీద అయితే లోకేష్ క్షమాపణలు చెప్పడమే కాదు మంచి ఆహారం పిల్లలకు అందించకపోవడం తన పొరపాటుగానే అంగీకరించారు అంటే గ్రేట్ లోకేష్ అని అంతా అంటున్నారు రాజకీయాల్లో ఇప్పటిదాకా అంతా చూస్తున్నారు కానీ ఒక మంత్రి ఇలా బాహాటంగా తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పడం అన్నది ఎక్కడా లేదని అంతా అంటున్నారు.
మెచ్చుకుంటున్న మిత్రులు :
సరిగ్గా ఇలాంటి విషయాల్లోనే కూటమి మిత్రులకు లోకేష్ నచ్చేస్తున్నారు. ఆయన తాజాగా తన శాఖకు సంబంధించి జరిగిన విషయానికి క్షమాపణ చెప్పడం జనసేన కీలక నేత నాగబాబుని సైతం ఆకట్టుకుంది. అందుకే అయాన నారా లోకేష్ నాయకత్వం తీరుని ఆయన చూపిస్తున మెచ్యూరిటీని అభినందించారు. మరి బీజేపీ నేతలు కూడా లోకేష్ మార్క్ పాలన తీరు పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఇలా మిత్రులకు సైతం మరింత దగ్గర అవుతున్న లోకేష్ అందరికీ ఆమోదయోగ్య నేతగా మారుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని మంచి స్థానంలో చూడాలని ఆశిస్తున్న తమ్ముళ్ల కోరిక తీరే రోజు అయితే ఎపుడు ఉందో ఎవరికీ తెలియదు కానీ దూరంలో అయితే లేదని అంతా అంటున్నారు.
