Begin typing your search above and press return to search.

లోకేష్ ఆహ్వానం...జగన్ ఓకేనా ?

ఇక పోతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేసారి మెగా డీఎస్సీ పేరుతో 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది.

By:  Satya P   |   24 Sept 2025 11:44 PM IST
లోకేష్ ఆహ్వానం...జగన్ ఓకేనా ?
X

అదేంటో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం లో కూడా అధికార పక్షం విపక్ష వైసీపీ కలిసిన దాఖలాలు లేవు. జూన్ 21న ప్రమాణ స్వీకారానికి మాత్రం అందరితో కలసి జగన్ అటెండ్ అయ్యారు. అపుడే సభలో చంద్రబాబు పవన్ లోకేష్ జగన్ లను ఒక్కసారి అంతా చూశారు. ఆ తరువాత బడ్జెట్ సెషన్ కి ముందు గవర్నర్ చేసే ప్రసంగానికి రెండు సార్లు జగన్ హాజరయ్యారు. అంతే అంతకు మించి జగన్ సభకు రావడం లేదు. ఇక చూస్తే శాసన సభ సమావేశాలు గత పదిహేను నెలలలో అనేక సార్లు జరిగాయి. కానీ సభలో వైసీపీ లేదు. అయితే వైసీపీ మీద మాత్రం కూటమి నుంచి విమర్శలు అయితే సభ లోపలా బయటా సాగుతూనే ఉన్నాయి.

రావాలి జగన్ :

ఇక పోతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేసారి మెగా డీఎస్సీ పేరుతో 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. వారికి సంబంధించిన నియామక పత్రాలను ఈ నెల 26న విజయవాడ వేదికగా భారీ కార్యక్రమం నిర్వహించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అందచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు అంతే కాదు విద్యా శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ పాల్గొంటున్నారు. అయితే ఈ మెగా వేడుకకు జగన్ ని కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం విశేషం.

పులివెందుల ఎమ్మెల్యేగా :

ఇంతటి పెద్ద కార్యక్రమం ఒక పండుగలా నిర్వహించే కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ ని కూడా ఆహ్వానిస్తున్నామని నారా లోకేష్ మీడియాకు చెప్పారు. జగన్ కూడా రావాలని ఆయన అంటున్నారు. జగన్ వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అయితే జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగానే ఆహ్వానిస్తున్నామని లోకేష్ చెప్పడం విశేషం.

జగన్ వస్తారా :

గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వ కాలంలో కూడా అధికారిక కార్యక్రమాలకు జగన్ ఎక్కడా హాజరు కాలేదని అంటున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆయన రాలేదు, ఇక 2024లో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పున ప్రారంభం కార్యక్రమానికి సైతం జగన్ ని పిలుస్తామని అన్నారు. మరి ఆయన అయితే రాలేదని అంటున్నారు. ఇపుడు మెగా డీఎస్సీ వేడుకకు జగన్ వస్తారా అన్నదే చర్చ. అయితే జగన్ రావాలని అనడం వెనక కూడా కూటమి రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. మా హయాంలో డీఎస్సీ మెగా స్కేల్ మీద నిర్వహించామని ఇప్పటికే చెప్పుకుంటోంది. దాంతో జగన్ వస్తే కళ్లారా అంతా చూస్తారనే ఈ పిలుపు అంటున్నారు. మరి జగన్ అయితే వచ్చేది ఉండదని అంటున్నారు. ఆయన రాక పోతే విశేషం లేదు కానీ వస్తేనే అది జాతీయ సంచలనం అవుతుందని కూడా అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.