Begin typing your search above and press return to search.

పొలిటికల్ అటెన్షన్ : లోకేష్ తో జూనియర్ గంటా !

మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖలో రాజకీయ సందడి తీసుకుని వచ్చారు. సెలవు వేళ అతి పెద్ద ఐటీ ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టడం ద్వారా విశాఖ ఫ్యూచర్ ఎంటో చెప్పారు.

By:  Satya P   |   13 Oct 2025 3:00 AM IST
పొలిటికల్ అటెన్షన్ : లోకేష్ తో జూనియర్ గంటా !
X

మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖలో రాజకీయ సందడి తీసుకుని వచ్చారు. సెలవు వేళ అతి పెద్ద ఐటీ ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టడం ద్వారా విశాఖ ఫ్యూచర్ ఎంటో చెప్పారు. విశాఖకు పేరు గడించిన సంస్థలు ఎన్నో రావడం వెనక కూటమి ప్రభుత్వం కృషి ఉంది. ఇదంతా కేవలం పదహారు నెలల పాలనలోనే జరిగింది. ఇక సండే అంతా కూటమి ప్రభుత్వం సక్సెస్ గురించే చర్చించుకునేలా లోకేష్ చేశారు. విశాఖ డెవలప్మెంట్ మీద సరికొత్త ఆశలను రేకెత్తించారు.

వారసుడి హడావుడి :

ఇదిలా ఉంటే నారా లోకేష్ టూర్ లో గంటా రాజకీయ వారసుడు గంటా రవితేజ హడావుడి అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఐటీ హిల్స్ మీద జరిగిన కార్యక్రమాలకు గంటా రవితేజ హాజరయ్యారు. ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతే కాదు అంతకు ముందు ఎయిర్ పోర్టులో లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. లోకేష్ టూర్ లో ఆద్యంతం గంటా రవితేజ కనిపించారు. ఇక భీమునిపట్నం నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా గంటా శ్రీనివాసరావు హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆయన ఎందుకో కనిపించలేదు, ఆయనకు బదులుగా అన్నట్లుగా రవితేజ రావడం జరిగిందా అన్న చర్చ మొదలైంది.

గుడ్ లుక్స్ లోకి :

ఇక చినబాబు టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ గుడ్ లుక్స్ లో పడేందుకు చాలా కాలంగా రవితేజ ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి భీమిలీ నియోజకవర్గంలోనే ఒక కార్యక్రమం జరగడం దానికి లోకేష్ రావడంతో రవితేజ చినబాబుతో మరింత దగ్గరగా గడిపే చాన్స్ వచ్చింది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇప్పటికే భీమిలీలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ తండ్రికి వారసుడిగా తాను ఉన్నాను అని చెప్పే ప్రయత్నం అయితే రవితేజా చేస్తున్నారు. అదే సమయంలో చినబాబు లోకేష్ ని సందర్భం వచ్చిన ప్రతీ సారీ ప్రశంసిస్తూ కూడా రవితేజ ముందుకు సాగుతున్నారు.

ఇద్దరు నేతల దీవెనలతో :

గంటా రవితేజ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వారసుడు మాత్రమే కాదు, మంత్రి నారాయణకు స్వయాన అల్లుడు. అందువల్ల ఆయన రాజకీయం టీడీపీలో సజావుగా సాగేందుకు పరిస్థితులు అన్నీ అనుకూలిస్తున్నాయనే అంటున్నారు. అయితే ఆ మధ్య గంటా విషయంలో అధినాయకత్వం కొంత అసంతృప్తిగా ఉంది అన్న వార్తలు అయితే వినిపించాయి. అందుకే ఆయనకు టికెట్ కూడా చివరి విడతలో ఇచ్చారని ప్రచారం సాగింది. ఇక మంత్రిగా కూడా ఆయనకు ఈసారి చాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో గంటా 2029 ఎన్నికల నాటికి తాను తప్పుకుని తన కుమారుడికి భీమిలీ పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు అంతే కాదు 2029 నాటికి రవితేజ పోటీ చేసేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ భరోసా ఉంటే కనుక జూనియర్ గంటా రాజకీయం రాణిస్తుంది అని అంటున్నారు ఆ దిశగానే రవితేజా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.