ఓవర్ టూ ఢిల్లీ : లోకేష్ విత్ మోడీ !
ఇక ఆ మధ్య అమరావతి రాజధానికి వచ్చి నరేంద్ర మోడీ లోకేష్ ని తానే స్వయంగా అడిగారు. ఒక్కసారి కుటుంబంతో సహా తన వద్దకు వచ్చి కలవమని.
By: Satya P | 4 Sept 2025 11:42 PM ISTతెలుగుదేశం పార్టీ భావి నాయకుడు మంత్రి అయిన నారా లోకేష్ వరసబెట్టి చేస్తున్న ఢిల్లీ యాత్రలు ఆసక్తిని గొలిపేలా ఉన్నాయి. అందరికీ ఒక్క విషయం గుర్తు ఉండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్యలో ఆనాడు కూడా సీఎం గా ఉన్న చంద్రబాబు ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్తుండేవాడు. ఒకసారి ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. 28 సార్లు ఢిల్లీ వెళ్ళాను అని. ఇక ఆ లెక్క సంగతి పక్కన పెడితే ఈ టెర్మ్ లో చంద్రబాబుకు ఆ భారాన్ని లోకేష్ తీరుస్తున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
క్రమం తప్పకుండా :
లోకేష్ ఏపీలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన తన మీద ఎన్నో బాధ్యతలను వేసుకుని మరీ పనిచేస్తున్నారు. ఆయన ఏపీలో కూడా అనేక చోట్ల టూర్లు చేస్తున్నారు. ఆయన తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను కలసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలను వారి దృష్టికి తెచ్చి వాటికి సాకారం చేసుకుని వస్తున్నారు. ఆ విధంగా ఢిల్లీ నుంచి ఏపీకి మధ్య ఒక గుడ్ రిలేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్ కూడా ఒకసారి ఢిల్లీ వెళ్తే కచ్చితంగా రెండు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వరసగా కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతున్నారు.
టీడీపీ కీలకంగా :
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఈసారి కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి ప్రాణాధారంగా టీడీపీ ఉంది. ఎన్డీయేలో రెండవ అతి పెద్ద మిత్ర పక్షంగా ఉంది. దాంతో అలా కలసి వచ్చిన రాజకీయ అవకాశాన్ని కూడా టీడీపీ ఉపయోగించుకుంటోంది అని అంటున్నారు. తమ ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న టీడీపీని ఏ మాత్రం విస్మరించే పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం లేదు దాంతో ఏపీకి సంబంధించిన అనేక సమస్యలను లోకేష్ ప్రస్తావిస్తూ ఇదే అదనుగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు అని అంటున్నారు.
మోడీ పిలుపు అందుకుని :
ఇక ఆ మధ్య అమరావతి రాజధానికి వచ్చి నరేంద్ర మోడీ లోకేష్ ని తానే స్వయంగా అడిగారు. ఒక్కసారి కుటుంబంతో సహా తన వద్దకు వచ్చి కలవమని. ఆ విధంగా లోకేష్ ఫ్యామిలీతో కలసి మరీ వెళ్ళి ప్రధానితో భేటీ అయ్యారు. అది లగాయితూ మోడీతో ఆయన వీలు చిక్కినపుడల్లా భేటీ అవుతూనే తాజాగా లోకేష్ మరోసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల అయిన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు అని అంటున్నారు. ఆ విధంగా మోడీతో తన అనుబంధాన్ని ఆయన మరింతగా పెంచుకోవడమే కాకుండా ఏపీ నుంచి రైజింగ్ లీడర్ గా పెద్దాయన దృష్టిలో పడేలా కూడా చూసుకుంటున్నారు అని అంటున్నారు.
ఆయనతోనూ కూడా :
అదే విధంగా కేంద్రంలో అత్యంత కీలకంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా నారా లోకేష్ భేటీ అవుతున్నారు. ఈసారి పర్యటన షెడ్యూల్ లో అది కూడా ఉందని అంటున్నారు. బీజేపీలో ఎన్ డీయీఅలో ఈ ఇద్దరు ఆగ్ర నేతలు తరచూ వారితో భేటీలు వేయడం ద్వారా నారా లోకేష్ బహుముఖ ప్రయోజనాలకే ఆశిస్తున్నారు అని అంటున్నారు. ఏపీకి కేంద్రం నుంచి ఏ సాయం అందినా అది కచ్చితంగా లోకెష్ ఖాతాలోనే పడుతుంది అన్నది నిజం. అంతే కాదు పెద్దల గుడ్ లుక్స్ లో ఉండడం వల్ల కూడా ఫ్యూచర్ టీడీపీ లీడర్ గా ఆయన మరింతగా ఎస్టాబ్లిష్ అవుతారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే లోకేష్ గతసారి వెళ్ళినపుడు యూరియాకు సంబంధించిన కొరతను వివరించి ఏపీకి రావాల్సిన వాటాను అడిగి తేగలిగారు. ఈసారి కూడా తన పర్యటనలో ఆయన ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తరు అని అంటున్నారు. ఇక చంద్రబాబుకు ఢిల్లీ టూర్ల భారం తగ్గించడం ద్వారా కూడా లోకేష్ తన కర్తవ్యం నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో సైతం ఎలివేట్ అవడానికి ఇదొక అవకాశం దానిని చాలా జాగ్రత్తగా లోకేష్ వినియోగించుకుంటున్నారు అని అంటున్నారు. కేంద్ర స్థాయిలో పెద్దలతో సన్నిహిత సంబంధాలు అన్నవి కచ్చితంగా భవిష్యత్తులో టీడీపీకి లోకేష్ కి మరింతగా మేలు చేసేవే అని అంతా అంటున్నారు.
