ఎంపీఎల్... క్రికెట్ మైదానంలో బ్యాట్ తో లోకేష్ సందడి!
అవును... నిత్యం రాజకీయాలతోనూ, మంత్రి బాధ్యతలతోనూ బిజీగా ఉండే నారా లోకేష్.. మంగళగిరి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలలను ప్రారంభించారు.
By: Raja Ch | 17 Jan 2026 10:59 AM ISTఏపీ మంత్రి నారా లోకేష్ కు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆడే కీలకమైన మ్యాచ్ లను నేరుగా స్టేడియంలోకి వెళ్లి ఆస్వాధిస్తుంటారు. ఈ విషయంలో స్వదేశం, విదేశం అనే తారతమ్యాలేమీ ఉండవు. ఇక వ్యక్తిగతంగానూ లోకేష్ మంచి క్రికెట్ ప్లేయర్ అనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో లోకేష్ సందడి చేశారు. కాసేపు బ్యాట్ పట్టుకుని తనదైన షాట్స్ తో అలరించారు.
అవును... నిత్యం రాజకీయాలతోనూ, మంత్రి బాధ్యతలతోనూ బిజీగా ఉండే నారా లోకేష్.. మంగళగిరి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలలను ప్రారంభించారు. అనంతరం.. వెంకట్రావు యూత్, ఉండవల్లి లెవెన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అనంతరం మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన మగువ వస్త్ర దుకాణాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తన భార్య బ్రాహ్మణికి, తల్లి భువనేశ్వరి దేవికి మంత్రి చీరలు కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో.. తన సొంత నిధులతో ఆధునికీకరించిన పీర్ల సావిడిని మంత్రి ప్రారంభించారు. ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అదేవిధంగా... రాష్ట్రంలోనే అధునాతన రైతు బజారు త్వరలోనే నిర్మిస్తామని చెప్పిన లోకేష్.. దాదాపు 300 మంది రైతులు నేరుగా తాము పండించిన కూరగాయలను వచ్చి విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు, విజయవాడతో పోల్చుకుంటే మంగళగిరిలో 25 శాతం ప్రజల పెరిగారనీ.. దానికి అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు.
