ఆయనతో పని చేయడం కష్టం...లోకేష్ కామెంట్స్ వైరల్ !
మంత్రి నారా లోకేష్ అటు పార్టీలో అత్యంత ప్రముఖ స్థానంలో ఉంటూ రాటుతేలుతున్నారు.
By: Satya P | 14 May 2026 9:25 AM ISTమంత్రి నారా లోకేష్ అటు పార్టీలో అత్యంత ప్రముఖ స్థానంలో ఉంటూ రాటుతేలుతున్నారు. ఇటు తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల విషయంలోనూ పట్టుదలగా పరిశ్రమిస్తూ నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారు. తండ్రి చంద్రబాబు ఎంతటి పని మంతుడో లోకేష్ కూడా అంతే ధీటుగా పోటీగా ఎదుగుతున్నారు. ఎక్కడా విసుగూ విరామం అన్నది లేకుండా బాబుతో సమానంగా నారా లోకేష్ పనిచేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. గడచిన రెండేళ్ల కాలంలో లోకేష్ మంత్రిగా ఎక్కడా రాజీ పడని ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అలుపూ సొలుపూ అన్నది దరి చేయనీయకుండా లోకేష్ పని చేస్తున్న తీరు నిజంగా అంతటా చర్చనీయాంశంగా ఉంది.
సంతోషంగా ఉండనీయరు :
లోకేష్ చాలా సందర్భాలలో చంద్రబాబు పనితీరు ఆయన ఇతరుల నుంచి ఆశించే విధానం అన్నీ చెబుతూ వస్తున్నారు. చంద్రబాబుకు పనిమంతులు అంటే ఇష్టం. ఆయనకు ఉమ్మడి ఏపీ సీఎం గా ఒక పేరు ఉంది. ఆయన నిద్రపోరూ అవతల వారిని నిద్రపోనీయరు అని. అలాగే ఆయన పనిచేస్తారు, ఇతరులను కూడా పని చేయకపోతే అసలు వదలరు, మరి కుమారుడు రేపటి పార్టీ సారధి అయిన లోకేష్ విషయంలో బాబు స్పేర్ చేస్తారా అంటే అసలు కుదరదు అనే అంటారు. అదే విషయాన్ని మంత్రి లోకేష్ తాజాగా సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. తాము ఏదైనా సాధిస్తే మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా చంద్రబాబు సంతోషంగా ఉండనివ్వరని లోకేష్ ఈ సందర్భంగా సరదాగా చేసిన వ్యాఖ్యలు అంతా చర్చించుకుంటున్నారు.
రిలాక్స్ అన్న మాటే లేదు :
చంద్రబాబుతో కలసి పనిచేయడంలో పోటీ పడాల్సిందే అని లోకేష్ చెప్పారు. తాము ఎక్కడ విశ్రాంతి తీసుకుంటామోనని ఎప్పుడూ మాకు ఏదో ఒక పని అప్పగిస్తునే ఉంటారని లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం సుమా అని కూడా అనేశారు. బాబుకు పని తెలుసు. పట్టుదల కూడా తెలుసు అని ఆయన గురించి లోకేష్ ఒక సక్సెస్ స్టోరీని కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తెలిపారు. చంద్రబాబు హెరిటేజ్‌కు ముందు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయని అయినా బాబు ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. అలా ఆయన 34 సంవత్సరాల పాటు చేసిన విశేషమైన కృషితోనే ఈ రోజున హెరిటేజ్ సంస్థ ఎదిగిందని అన్నారు. అలా ఆ సమ్షను బాబు ఎంతగానో విజయవంతం చేశారని అన్నారు. ఒక్క రాత్రిలో హెరిటేజ్ ఈ స్థితిలో లేదని, అది అంచెలంచెలుగా ఎదిగింది అని లోకేష్ గుర్తు చేశారు. అందుకే
బాబు ముందు చూపుతోనే :
చంద్రబాబు అంటేనే విజన్ అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు ఎపుడూ మూడు దశాబ్దాల ముందు చూపుతో ఉంటారని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అని బాబు అంటే కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఆనాడు అవహేళన చేశారని ఫ్లాష్ బ్యాక్ గురించి లోకేష్ చెప్పారు. కానీ ఈ రోజున అదే హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో అంతా చూస్తున్నారని అన్నారు. అలానే ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని కూడా బాబు పట్టుదలతో చేస్తున్న ప్రయత్నంగా లోకేష్ చెప్పారు. దీనిని కూడా ఏపీ సాధిస్తుందని ఆయన అన్నారు.
