మంత్రి ఎక్సర్‌సైజ్... లోకేష్ కామెంట్!
ఆయన ఎత్తయిన బల్లపైకి జంప్ చేసే ఎక్సర్ సైజ్‌ను చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడు సాయం చేస్తున్నారు.
By: Garuda Media | 11 April 2026 11:00 PM ISTఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎక్సర్ సైజ్ చేస్తారు. వ్యాపార వేత్తల కుటుంబానికి చెందిన భరత్ .. ఇంట్లోనే పెద్ద జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ ఆయన వ్యాయామం చేస్తారు. అయితే.. ఎప్పుడూ.. దీనికి సంబంధించిన వీడియోలువెలుగు చూడలేదు. కానీ.. తాజాగా శనివారం మంత్రి భరత్ వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఆయన ఎత్తయిన బల్లపైకి జంప్ చేసే ఎక్సర్ సైజ్‌ను చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడు సాయం చేస్తున్నారు. ఇది ఒకింత సంక్లిష్టమైన ఎక్సర్‌సైజ్.. సుమారు మూడు అడుగుల ఎత్తున్న బల్లపైకి ఎగిరి జంప్ చేసి.. నిలబడాలి.ఈ ఎక్సర్‌సైజ్ ద్వారా.. నడుము, కాళ్లకు బలం చేకూరు తుంది. అదేవిధంగా శారీర వ్యాయామంలో ఇది కీలకం కూడా.
ఈ వీడియో వెలుగు చూడగానే మరో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్ చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న భరత్ .. చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగా ఆయన చేస్తున్న ఎక్సర్ సైజ్.. మంత్రిగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చే ప్రయత్నంతో సరిసమానంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు కూడా ఇలానే కష్టపడాల్సి వస్తోందని లోకేష్ వ్యాఖ్యానించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నామని నారా లోకేష్ తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా ఏపీని సాధించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇలా.. మంత్రి ఎక్సర్‌సైజ్ వీడియోకు లోకేష్ కామెంటు రాయడం ఇదే తొలిసారి. అందునా.. దానిని పెట్టుబడుల కల్పనతో ముడిపెట్టడం మరింత ఆసక్తిగా మారింది.
