మాసు - క్లాసు.. అందరి వాడిగా లోకేష్.. !
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. చాలా భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నారు.
By: Garuda Media | 6 Nov 2025 5:00 AM ISTటీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. చాలా భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నారు. ఒక నేతగానే కాకుండా.. వ్యూహాత్మక నాయకుడిగా కూడా ఆయన తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది. సాధారణంగా.. ఒక నాయకుడు క్లాస్, లేదా మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారు. అయితే.. అటు లేకపోతే.. ఇటు.. అన్నట్టుగా వ్యవహరిస్తా రు. ఏపీలో మాజీ నేతల నుంచి ప్రస్తుతం ఉన్న వారి వరకు అందరూ దాదాపు ఇదే ధోరణిలో ఉన్నారు.
ఉదాహరణకు చంద్రబాబును తీసుకుంటే.. ఈయన ఎంతో ప్రయత్నించినా.. మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకోలేకపోతున్నారన్న వాదన పార్టీ వర్గాల్లోనే ఉంది. అంటే,.. క్లాస్ నేతగా చంద్రబాబు పేరు తెచ్చుకు న్నారు. ఇక, వైసీపీ అధినేత జగన్.. మాస్ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈయన క్లాస్ కావాలని ప్రయ త్నించలేదు.. అయినా.. అవుతారన్న గ్యారెంటీ కూడా లేదు. ఆయన రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయన్న, ఉంటాయన్న వాదన కూడా ఉంది.
ఇలా.. కొందరు నాయకుల వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, నారా లోకేష్ విషయానికి వస్తే.. క్లాస్-మాస్ కలగలుపుగా ఉందన్న టాక్.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అటు క్లాస్ పీపుల్‌తో ఎలా వ్యవహరించాలో.. అలానే ఉంటున్నారు. వారికి చేరువ అవుతున్నారు. వారిని ఆకట్టుకుంటున్నారు. ఇదేసమయంలో మాస్‌తోనూ కలిసి పోతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనను గమనిస్తే.. క్లాస్ పీపుల్ తో ఆయన వ్యవహరించిన తీరు కనిపిస్తుంది.
ఇక, ప్రజాదర్బార్ సహా.. ఇతర కార్యక్రమాల్లో మాస్ పీపుల్‌తో అంతే చొరవగా కలిసిపోతున్నారు. ఈ సమ యంలో తాను మంత్రిని, ఒక పార్టీకి జాతీయ కార్యదర్శినిఅనే విషయాన్ని ఆయన పక్కన పెట్టి వారితో మమేకం అవుతున్నారు. అంతేకాదు.. ఆహార్యం నుంచి వ్యవహారం వరకు కూడా క్లాస్‌కు, మాస్‌కు తేడా ఉన్నట్టుగా.. నారా లోకేష్ లోనూ అదే తేడా కనిపిస్తోంది. మాస్ ప్రజలకు చేరువ కావాల్సి వస్తే.. ఆయన ఆహార్యం పూర్తినార్మల్‌గా ఉంటోంది. అదే క్లాస్‌తో కలవాల్సి వస్తే.. సూట్ వేసుకుని, జాకట్ ధరించి కనిపిస్తున్నారు. ఇలా.. రెండు భిన్నమైన వర్గాలకు.. నారా లోకేష్ చేరువ కావడం ఏపీ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.
