Begin typing your search above and press return to search.

ఫ్యాన్ వైబ్: క్రికెట్ దేవుడితో లోకేష్ దంపతులు!

అయితే ఇక్కడ ఒక ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా క్రికెట్ బ్లూ కలర్ జెర్సీ ధరించి క్రికెట్ జరిగే ప్రాంగణంలో సందడి చేశారు.

By:  Madhu Reddy   |   3 Nov 2025 10:13 AM IST
ఫ్యాన్ వైబ్: క్రికెట్ దేవుడితో లోకేష్ దంపతులు!
X

మిగతా క్రీడలతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ గురించి.. క్రికెట్ పట్ల పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళు సైతం ఈ క్రికెట్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అంతేకాదు ప్రెస్టేజియస్ గేమ్ గా పేరు దక్కించుకున్న ఈ క్రికెట్ ఇటీవల ప్రపంచ కప్ కోసం పురుషుల విభాగం పూర్తవగా.. ఇప్పుడు 1978 నుండి ప్రపంచ కప్ కోసం ఎంతగానో ఎదురు చూసిన మహిళల కల నెరవేరింది. గత కొన్ని దశాబ్దాల ప్రయత్నం తర్వాత ముచ్చటగా మూడవ ప్రయత్నంతో ప్రపంచకప్ ను సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.

అయితే 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దేశం మొత్తం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, ప్రజలు ఈ ఆటను తిలకించారు. అయితే ఇక్కడ ఒక ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా క్రికెట్ బ్లూ కలర్ జెర్సీ ధరించి క్రికెట్ జరిగే ప్రాంగణంలో సందడి చేశారు. అక్కడ నుంచి వీరు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఫ్యాన్ వైబ్, పిక్ అఫ్ ది డే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

క్రికెట్ దేవుడితో నారా లోకేష్ దంపతులు అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. 2025 మహిళల ప్రపంచ కప్ కోసం భారతదేశంలో క్రికెట్ పోటీ జరుగుతున్న సమయంలో క్రికెట్ దేవుడిగా పేరు సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ తో నారా లోకేష్ , ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కలిసి ఫోటోలు దిగారు. ఇందులో నారా లోకేష్, బ్రాహ్మణి క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుతూ.. బ్లూ కలర్ జెర్సీ ధరించి క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని చాటగా.. మరొకవైపు సచిన్ టెండూల్కర్ బ్లాక్ కలర్ షర్టు , వైట్ కలర్ ప్యాంటు ధరించి సింపుల్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోని నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అందరూ ఈ ఫోటోపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2025 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీ విషయానికి వస్తే.. 1978 నుంచి ప్రపంచ కప్ కోసం మహిళల విభాగంలో మహిళలు పోరాడుతూనే ఉన్నారు. కానీ సాధ్యపడలేదు.. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది. కానీ ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో కూడా మిథాలీ జట్టు చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా నిరాశ మిగిలింది. కానీ 47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు మహిళలు ప్రపంచకప్ ను సొంతం చేసుకుని.. భారతదేశ సుదీర్ఘ కలను నెరవేర్చారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందనడంలో సందేహం లేదు.