నారా లోకేష్ ఫ్యాన్-బాయ్ మూమెంట్... పిక్స్ వైరల్!
అవును... నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం లోకేష్ & ఫ్యామిలీ వెళ్లారు.
By: Raja Ch | 2 Nov 2025 9:42 PM ISTనవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ - 2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను మైదానంలో నుంచి తిలకించడానికి ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ను కలిశారు. ఈ విషయాలను లోకేష్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
అవును... నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం లోకేష్ & ఫ్యామిలీ వెళ్లారు. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ తో లోకేష్, బ్రాహ్మణి ఫోటోలు దిగారు. ఈ ఫోటోల్లో వైట్ ప్యాంట్, బ్లాక్ షర్ట్ ధరించి సచిన్ ఉండగా.. టీమిండియా జెర్సీలతో లోకేష్, బ్రాహ్మణి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ విషయాలను పంచుకుంటూ లోకేష్.. సచిన్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇందులో భాగంగా... ఫ్యాన్-బాయ్ మూమెంట్ అని మొదలుపెట్టిన లోకేష్... 'ఈరోజు ఆ లెజెండ్ ను స్వయంగా కలిశాను. అతని వినయం, ఆప్యాయత గురించిన ప్రచారం పూర్తిగా నిజం.. వాటిని స్వయంగా అనుభవించడం ఒక అదృష్టం. ధన్యవాదాలు సచిన్. క్రికెట్ దేవుడిగా తరాలకు స్ఫూర్తినిచ్చినందుకు, మరింత మెరుగైన వ్యక్తిగా ఉన్నందుకు' అని రాశారు.
మరోవైపు... 'నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో బ్రాహ్మణి, దేవన్ష్ తో కలిసి చరిత్ర సృష్టిని చూసి చాలా సంతోషంగా ఉంది. టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు, మహిళల క్రికెట్ ఎదుగుదలను జరుపుకోవడానికి మేము గర్విస్తున్నాము! భారతదేశం తొలి టైటిల్ కోసం దక్షిణాఫ్రికాను ఢీకొంటున్నందున ఆ క్షణాన్ని కుటుంబంగా పంచుకోవడం కంటే గొప్పది మరొకటి లేదు, తదుపరి తరం పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుంది' అని స్టేడియంలో ఉన్న ఫోటోను పంచుకున్నారు.
