కోనసీమలో ఏఐ బూం....లోకేష్ స్పీడ్
ఏపీని ఏఐకి రాజధానిగా చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంలో ఐటీ మంత్రిగా లోకేష్ పట్టుదలగా పనిచేస్తున్నారు.
By: Satya P | 9 Nov 2025 9:41 AM ISTఒకనాడు చూస్తే ఏపీ నుంచి ఎందరో ప్రతిభావంతులు ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలసలు వెళ్ళిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, తెలంగాణా, కర్ణాటకలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేవారు. అయితే ఇపుడు అలా వలస పోతున్న ప్రతిభను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టుకుంటోంది. ముఖ్యంగా ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఎంతో మంది ఔత్సాహికులు టాలెంట్ పీపుల్ తిరిగి ఏపీలో తమ ప్రాజెక్టులను పెట్టడానికి వస్తున్నారు.
కోనసీమలో :
ఇక తాజాగా మంత్రి లోకేష్ కి ఒక ఏఐ ప్రాజెక్ట్ సంస్థాపకుడికి మధ్య సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. తాను కొనసీమలోని ఒక కుగ్రామంలో ఏఐ ప్రాజెక్ట్ ని స్థాపించాలని చూస్తున్నాను అని తనకు కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు కావాలని ఫణీంద్ర రెడ్డి అనే నెటిజన్ నేరుగా లోకేష్ ని కోరారు. తన ప్రాజెక్టుకు అమెరికాలోని తన మిత్రులు ఇతర టాలెంటెడ్ కమ్యూనిటీ మద్దతు కూడా ఉందని తెలియచేశారు. దానికి వెంటనే రియాక్ట్ అయిన లోకేష్ తప్పకుండా ప్రభుత్వం సహకరిస్తుంది చెప్పడమే కాదు, ఏపీలో రతన్ టాటా పేరుతో ఉన్న పాలనా వ్యవస్థ నుంచి ఏఐ పరంగా ఫణీంద్ర రెడ్డికి అవసరం అయిన సహాయం చేయడానికి ఆదేశాలు కూడా ఇస్తున్నట్లుగా తెలియచేశారు.
అనూహ్యమైన స్పందన :
సాధారణంగా పాలకుల నుంచి వెంటనే స్పందన ఏ విషయంలోనూ రాదు, కానీ లోకేష్ తీరే వేరుగా ఉంటుంది. ఆయనకు ఆయనే సుమోటోగా అనేక అంశాలలో స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక తనను నేరుగా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఏదైనా కోరితే ఆయన ఏ మాత్రం లేట్ చేయరు, వెంటనే తన ప్రతిస్పందనను తెలియచేడమే కాదు, వారు కోరుకున్న పనిని పరిపూర్తి చేస్తారు. ఇపుడు ఫణీంద్ర రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇంత క్విక్ గా రెస్పాన్స్ కావడం ఒక ఐటీ మంత్రికి ఏపీ మీద ఉన్న ఆలోచనలు ఏఐ ఆధారిత సంస్థల ఆవిర్భావం కోసం పడుతున్న తపన అన్నీ అర్ధం అవుతున్నాయని అంటున్నారు.
ఏఐ బూం స్టార్ట్ :
ఏపీని ఏఐకి రాజధానిగా చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంలో ఐటీ మంత్రిగా లోకేష్ పట్టుదలగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక ఏఐ వ్యవస్థాపకుడు ఫణీంద్ర రెడ్డి అక్కడ ని ఒక మారుమూల గ్రామంలో నిర్మిస్తున్న కొనసాగుతున్న ఏఐ ప్రాజెక్ట్ కోసం మద్దతును కోరడమేంటి లోకేష్ వెంటనే అభయం ఇవ్వడం జరిగిపోయింది. ఈ విధంగా కోనసీమలో ఏఐ బూం స్టార్ట్ అయిపోయింది.
ఏపీలో స్పీడ్ :
ఏఐ ఇపుడు ఏపీలో తన స్పీడ్ ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏఐకి సంబంధించిన ఎకో సిస్టం ని బిల్డప్ చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం టాటా, మైక్రోసాఫ్ట్ ఇతర అగ్రశ్రేణి కంపెనీలతో భాగస్వామ్యంతో కూటమి సర్కార్ వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. పూర్తిగా లోకల్ టాలెంట్ ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం ద్వార ఏఐ బూం ఏపీలో మరింతగా కొనసాగుతుందని కూటమి పాలకులు భావిస్తున్నారు. మొత్తానికి తాజాగా నెటిజన్ కి ఐట్ మంత్రి అందించిన సాయం చూపించిన చొరవ అసలైన ఉదాహరణ అంటున్నారు.
