స్థానిక ఎన్నికల ఎఫెక్ట్: కుప్పంలో బాబు సతీమణి పర్యటన!
వచ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.
By: Garuda Media | 25 July 2026 3:10 PM ISTవచ్చే రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ దఫా క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీడీపీ అడుగులు వేస్తోం ది.గతంలో ఇక్కడి పంచాయతీల్లో వైసీపీ అనుకూల వ్యక్తులు పాగా వేశారు. ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో టీడీపీ హవా కనిపించాలన్న ఉద్దేశం ఉంది.
ఈ నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన గతానికి భిన్నంగా ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇటీవల కాలంలో భువనేశ్వరి కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా రు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. మహిళలకు ఉపాధి మార్గాలను కూడా చూపిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ సంక్షేమ పథకాలు అందేలా కూడా చర్యలు తీసుకున్నారు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలాలన్నీ.. పార్టీకి పరోక్షంగా దక్కేలా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. అందుకే నేరుగా భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారన్న చర్చ టీడీపీ నేతల మధ్య విని పిస్తోంది. ఈ నెల 27 నుంచి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించనున్నారని నాయకులు తెలిపారు. నాలుగు రోజులు నాలుగు మండలాల్లో ప్రజలతో ఆమె మమేకం అవుతారు. అదేసమయంలో పార్టీ కార్యక ర్తలు, నాయకులతోనూ భువనేశ్వరి చర్చిస్తారు.
పలు గ్రామాలతో పాటు, స్కూళ్లను సందర్శించనున్న భువనేశ్వరి.. ప్రభుత్వం పరంగా జరుగుతున్న అభివృద్ధిని మరింత సమగ్రంగా తెలుసుకోవడంతోపాటు ప్రజలకు కూడా వివరించనున్నారు. అలానే.. 'ఎన్టీఆర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళలు, విద్యార్థులతో భువనే శ్వరి ముఖాముఖి నిర్వహిస్తారు. మొత్తంగా.. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడంతోపాటు.. ప్రజలను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసేలా ఆమె ప్రణాళిక ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
