Begin typing your search above and press return to search.

యూట్యూబర్ నందు సక్సెస్.. రావాల్సిన మైలేజ్ వచ్చింది.. మైలేజ్ ఊరికే రాదు!

యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేశారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   8 Sept 2026 4:06 PM IST
యూట్యూబర్ నందు సక్సెస్.. రావాల్సిన మైలేజ్ వచ్చింది.. మైలేజ్ ఊరికే రాదు!
X

యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేశారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించి గతంలో అనిల్ రావిపూడి-చిరంజీవి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడి వార్తల్లో నిలిచారు.

యూకేలో నివసించే నందుపై పలువురు తెలుగు రాష్ట్రాల బాధితులు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె హైదరాబాద్‌కు రావడం.. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిని రేపుతోంది. మీడియా అంతా ఈమె వార్తలు నామస్మరణతో మారుమోగిపోతోంది.

నందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. యూట్యూబ్ వీడియోల ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమాలో కనిపించడం కూడా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. అయితే ఇప్పుడు ఆమె పేరు మాత్రం సినిమా లేదా యూట్యూబ్ కంటెంట్ వల్ల కాకుండా కేసులు, అరెస్ట్ వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది.

బిగ్ బాస్ ఆఫర్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారా?

నందుకు తెలుగు బిగ్ బాస్‌లో అవకాశం దక్కిందనే ప్రచారం కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. కేసులు, లుక్‌ఔట్ నోటీసుల నేపథ్యంలో కూడా ఆమె హైదరాబాద్‌కు రావడం వెనుక బిగ్ బాస్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.

హైదరాబాద్ చేరుకున్న సమయంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణకు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారనే ప్రచారానికి భిన్నంగా ఆమె రాక మరో కారణంతో వార్తల్లోకి వచ్చింది.

అరెస్ట్‌తో ఒక్కసారిగా పెరిగిన ఫ్రీ పబ్లిసిటీ?

నందు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం తెలుగు మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆమె పేరు ట్రెండ్ అవుతూ ఉండటంతో ఒక్కసారిగా ఆమెకు భారీ ప్రచారం లభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు అరెస్ట్.. ఇంకోవైపు బిగ్ బాస్ ఎంట్రీపై ప్రచారం.. ఇలా అన్నీ కలిసి నందును వార్తల్లో నిలిపాయి.

దీంతో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. "నందుకు రావాల్సిన మైలేజ్ వచ్చేసింది.. మైలేజ్ ఊరికే రాదు" అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలోకి వెళ్లాలనుకునే వారికి ముందుగానే విపరీతమైన పబ్లిసిటీ రావడం కలిసొచ్చే అంశమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇదంతా కేవలం సోషల్ మీడియా చర్చలు, ఊహాగానాలకే పరిమితం. నందుకు నిజంగా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా? ఆమె హైదరాబాద్‌కు రావడానికి అదే కారణమా? అనే విషయాలపై అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది.

మరోవైపు నందుపై వచ్చిన ఉద్యోగ మోసం ఆరోపణలు, నమోదైన కేసులు, పోలీసుల దర్యాప్తు వంటి అంశాలు చట్టపరమైన ప్రక్రియలో ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు నిర్ధారణ అయినట్లు చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం నందు పేరు తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతోంది.

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే.. బిగ్ బాస్‌లోకి వెళ్లకముందే నందుకు కావాల్సినంత హైప్ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఈ పబ్లిసిటీ ఆమెకు భవిష్యత్తులో మైలేజ్‌గా మారుతుందా? లేక కేసుల వ్యవహారమే ఆమెకు ఇబ్బందిగా మారుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.