Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర‌కు రెడీ అయిన‌ మాజీ ఎంపీ.. జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం ఈయన సైలెంట్ గా ఉన్నారు. పార్టీ తరపున కూడా పెద్దగా బయటకు రావడం లేదు.

By:  Garuda Media   |   30 July 2025 8:29 PM IST
పాద‌యాత్ర‌కు రెడీ అయిన‌ మాజీ ఎంపీ.. జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!
X

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం ఈయన సైలెంట్ గా ఉన్నారు. పార్టీ తరపున కూడా పెద్దగా బయటకు రావడం లేదు. అయితే అంతర్గతంగా మాత్రం తన అనుచరులు, తన అనుకూల వర్గాల ద్వారా తనపై `సింపతి` ఏ మేరకు ఉందనేది ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా వైసిపి అధినేత జగన్ నిర్వహించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నందిగం సురేష్ రాజకీయాలను గురించి ప్రస్తావించారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని, గత 2019 ఎలక్షన్స్ లో గెలిపించాలని చెప్పారు.

అయితే ఇప్పుడు వరుస పెట్టి కేసులు పెడుతూ ఉండడం.. దాదాపు 200 రోజులు పాటు జైల్లో ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బాపట్లలో సురేష్ కు సింపతి పెరిగిందని జగన్ వ్యాఖ్యానించడం విశేషం. సాధారణంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఈ తరహా సింపతి ఉంటుంది. తమ నాయకుడు పదేపదే జైలుకు వెళ్లడం ద్వారా ఆ వర్గంలో చర్చకు దారితీసి, ఆటోమేటిక్ గాని అది సింపతిగా మారే అవకాశం ఉంటుంది. బాపట్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ విష‌యం జగన్ చెప్పిన మాట. నిజానికి ఇప్పటికీ రెండు సార్లు నందిగామ సురేష్ జైలుకు వెళ్లి వచ్చారు.

దీంతో సహజంగానే ఆయనపై నియోజకవర్గంలో సింపతి ఏర్పడిందన్నది అధికార పార్టీ టీడీపీ కూడా గుర్తించింది. అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి దీనివల్ల పెద్దగా తమకు నష్టం లేదని అదే సమయంలో వైసీపీకి ప్రయోజనం కూడా లేదనేది టిడిపి అంచనా. అందుకని సురేష్ కూడా తన గ్రాఫ్ పై తన అనుచరులు తన వర్గం వారితో పరిశీలన చేయించుకుంటున్నారు. పెరిగిన సింపతిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునేందుకు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన మద్దతు కూడగట్టేందుకు సురేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి.. తానే వారించా నని.. లేకపోతే సురేష్ పాదయాత్రకు రెడీగా ఉన్నాడని జగన్ చెప్పుకొచ్చారు.

సో ఈ పరిణామాలను గమనిస్తే సింగిల్ టైం ఎంపీగా మిగిలిపోకూడదు అన్న ఉద్దేశంతో నందిగం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని స్పష్టం అవుతుంది. అయితే ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఆయన ఎలా ముందుకు వెళ్తారు.. ఈలోగా ఎదురయ్యే సమస్యలు ఏంటి.. అధికార పార్టీ ఆయన దూకుడు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుంది.. అన్నది వేచి చూడాలి.