Begin typing your search above and press return to search.

"నేనేం తప్పు చేయలేదు.. అంతా మీరే సృష్టించారు..’" మీడియాపై యూట్యూబర్ నందన ఫైర్

విదేశీ ఉద్యోగాలు, వీసా సేవల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ నందన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   9 Sept 2026 10:03 AM IST
నేనేం తప్పు చేయలేదు.. అంతా మీరే సృష్టించారు..’ మీడియాపై యూట్యూబర్ నందన ఫైర్
X

విదేశీ ఉద్యోగాలు, వీసా సేవల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ నందన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెపై లుకౌట్ నోటీసులు దృష్ట్యా అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా సేవలు అందిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారంటూ నందనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగానే ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు.. “నేనేం తప్పు చేయలేదు.. అంతా మీరే సృష్టించారు” అంటూ ఆమె మీడియా ప్రశ్నించగా ఆగ్రహంతో స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె మీడియాపై ఫైర్ అయ్యారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం నందనపై వచ్చిన ఆరోపణలు, పోలీసులు చేపడుతున్న దర్యాప్తు, లుకౌట్ నోటీసుల వ్యవహారం వంటి అంశాలపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు పూర్తిచేసిన తర్వాతే ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు, డబ్బుల లావాదేవీలు, బాధితుల సంఖ్య తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నందనపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలే కావడంతో, తుది నిర్ధారణకు ముందు వాటిని ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. విచారణ తర్వాత అసలు నిజానిజాలు బయటకు రానున్నాయి.