Begin typing your search above and press return to search.

బాలయ్య మంత్రి అవుతున్నారా ?

నందమూరి బాలక్రిష్ణ. తండ్రికి తగిన తనయుడు. సినీ రంగంలో ఆయన పేరు నిలుపుకున్నారు.

By:  Satya P   |   23 Jun 2026 9:17 AM IST
బాలయ్య మంత్రి అవుతున్నారా ?
X

నందమూరి బాలక్రిష్ణ. తండ్రికి తగిన తనయుడు. సినీ రంగంలో ఆయన పేరు నిలుపుకున్నారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలను అన్నీ బాలయ్య చేశారు. అన్ని జానర్లలో తనదైన నటనా పటిమను చూపించారు. శభాష్ అనిపించుకున్నారు. వందకు పైగా సినిమాలు నటించారు. పద్మ భూషణుడు అనిపించుకున్నారు. బాలయ్య అంటే టాలీవుడ్ అగ్రనటుడు మాత్రమే కాదు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ కూడా. పదిహేనేళ్ల క్రితం ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.

ఊపిరి పోసుకుంది :

నాడు ఎన్నో ఒడుదుడుకులు ఈ ఆసుపత్రి ఎదుర్కొంటున్న సమయంలో బాలయ్య సారధ్యం ఊపిరి పోసింది. ఆయన తన తపనతో అకుంఠిత దీక్షతో ఆసుపత్రిని పెంచి పెద్దది చేశారు. వంద పడకల ఆసుపత్రి కాస్తా ఈ రోజున ఆరు వందల యాబై పడకలుగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆసుపత్రి దూసుకుని పోతోంది. ఎంతో మందికి భయంకరమైన క్యాన్సర్ రోగాన్ని నయం చేసి ఆసుపత్రి తన కీర్తిని పెంచుకుంది. బాలయ్య తన పలుకుబడితో విరాళాలు సేకరించి ఆసుపత్రికి ఆర్ధిక పరిపుష్టి చేకూర్చారు అని కూడా చెప్పాలి.

బాబు పొగడ్తల వర్షం :

ఇదిలా ఉంటే ఆసుపత్రి పాతికేళ్ల ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు బాలయ్యను అయితే గొప్పగా పొగిడారు. బాలయ్య సేవలు అన్ స్టాపబుల్ అన్నారు. ఆయన నటుడిగా చప్పట్లు కొట్టించుకున్నారు. కానీ ఇపుడు ఆసుపత్రి చైర్మన్ గా చేస్తున్న సేవతో జనాలకు గుర్తుండిపోతారు అన్నారు. సమాజ సేవ ఎవరు అంటే బాలయ్య గుర్తుకు వస్తారు కేరాఫ్ ఆయనే అవుతారు అని బాబు పొగిడారు. బాలయ్య మీద ఇంతలా బాబు ప్రశంసలు కురిపించడం విశేషంగానే చూస్తున్నారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా :

ఇదిలా ఉంటే టీడీపీకి వీర విధేయుడిగా బాలయ్య ఉన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పనిచేస్తున్నారు. తన సినీ కెరీర్ కి రాజకీయాలు మొదట్లో ఇబ్బందిగా మారింది కూడా లెక్కచేయకుండా బాలయ్య పార్టీ ప్రచారం కోసం ముందుకు వచ్చారు. ఇక 2014 లో తొలిసారి గెలిచిన బాలయ్య 2019లో జగన్ వేవ్ లో కూడా గెలిచి శభాష్ అనిపించుకున్నారు. 2024లో ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. మరి ఆయనకు మంత్రి పదవి దక్కాలన్నది అభిమానుల అభిమతంగా ఉంది. బాలయ్య దానికి పూర్తిగా అర్హుడని కూడా అంటున్నారు.

భవిష్యత్తు కోసమే :

ఇక బాలయ్య ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అని రెండూ చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి ఇపుడు ఇస్తే సినిమాలలో ఆయన జోరు తగ్గుతుందని కూడా అంటున్న వారూ ఉన్నారు. బాలయ్య కోరుకోవాలే కానీ మంత్రి కావడం కష్టం కాదని అంటున్న వారూ ఉన్నారు. అయితే బాలయ్య ప్రస్తుతానికి సినిమాల జోరు చూపిస్తున్నా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాజకీయాల మీదనే ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఆయన ఆ మధ్యనే హిందూపురంలో సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. దాంతో బాలయ్య హిందూపురానికి మరిన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తారు అని అభిమానులు అంటున్నారు. అయితే ఏపీ మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపధ్యంలో బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఇపుడు చర్చనీయాంశగా ఉంది. సామాజిక సమీకరణలు కూడా కూడికలు తీసివేతల తరువాత ఒక కొలిక్కీ వస్తే మాత్రం బాలయ్యకూ చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.