Begin typing your search above and press return to search.

బాలయ్య ఈ గోల ఏందయ్యా ?

నందమూరి బాలక్రిష్ణకు గత కొంతకాలంగా రాజయోగం నడుస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారంగా ఉంది.

By:  Satya P   |   27 Sept 2025 1:01 AM IST
బాలయ్య ఈ గోల ఏందయ్యా ?
X

నందమూరి బాలక్రిష్ణకు గత కొంతకాలంగా రాజయోగం నడుస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారంగా ఉంది. ఆయన సినిమాలు వరసబెట్టి హిట్ అవుతున్నాయి. గ్రాస్ వంద కోట్లకు చేరుకుంటున్నాయి. అఖండ 2 ఎవైటింగ్ మూవీగా ఉంది. దాని తరువాత కూడా మరిన్ని సినిమాలు ఎగ్జైటింగ్ మూవీస్ గా షూట్ కి రెడీగా ఉన్నాయి. ఇక ఆయనకు 2025 ఎంతో గొప్పగా ఉంది. రెండవ అతి పెద్ద పౌర పురస్కారం పద్మ భూషణ్ బాలయ్యకు లభించింది. ఇక ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఫిల్మ్ హిస్టరీకి గానూ గిన్నీస్ రికార్డు దక్కింది. ఆయన నటించిన భగవంత్ కేసరి మూవీకి జాతీయ అవార్డు దక్కింది. ఇలా బాలయ్య మంచి ఫాం లో ఉన్నారు. అయితే ఒకే ఒక్క తప్పు అన్నట్లుగా ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు తూలాయి. అవి కాస్తా అగ్గి రాజేసాయి. దాని ఫలితంగా స్వపక్షంలో మౌనం కనిపిస్తూంటే విపక్షం అయితే బాలయ్యని తీవ్రంగా విమర్శిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని కూడా బయట పెట్టి బాలయ్య గురించి ఈ తరానికి కొత్తగా చెప్పాల్సింది చెబుతోంది.

సైకో అంటూ :

బాలయ్య గురువారం అసెంబ్లీలో కొన్ని నిముషాలు మాత్రమే మాట్లాడారు. అయితే ఆయన అన్న మాటలు మాత్రం మంట పుట్టించాయి. జగన్ మీద చిరంజీవి మీద ఒకేసారి ఆయన విమర్శలు చేశారు. దాంతో అటూ ఇటూ ఆయన మీద బాణాలు గట్టిగా వచ్చి గుచ్చుకుంటున్నాయి. వైసీపీ అయితే గత రెండు రోజులుగా బాలయ్యని ఘాటుగా విమర్శిస్తోంది. మాజీ మంత్రులు కీలక నేతలు అంతా బాలయ్య మీద హీటెత్తించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి బాలయ్యను గట్టిగానే తగులుకున్నారు. సైకో బాలయ్య అని ఇవ్వాల్సిన నాలుగు ఇచ్చేశారు.

ప్రమాణం చేయి ముందు :

అఖండ సినిమా కోసం బాలయ్య జగన్ తో కలవాలని మట్లాడాలని తనకు ఫోన్ చేసింది నిజం అవునా కాదా అని మీడియా ముఖంగానే నాని నిలదీశారు తాను తన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి ఈ విషయం నిజం అని చెబుతున్నాను అన్నారు. బాలయ్య కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు అసెంబ్లీకి వచ్చే వారిని చెక్ చేసేందుకు ఏకంగా గేట్ వద్దనే బ్రీత్ అన‌లైజ‌ర్ పెట్టాలని నాని కామెంత్స్ చేశారు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుతో సరిసమానంగా లభిస్తున ఆదరణ హోదా చూసి బాలయ్య ఏడుస్తున్నారు అని కూడా పేర్ని నాని కొత్త విషయం చెప్పారు. ఆ గౌరవ మర్యాదలు తనకు దక్కలేదని కూడా ఆయన లోలోపల రగిలిపోతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఎంతో గొప్ప సంస్కారం కలిగిన వారి ఇంట పుట్టిన బాలయ్య నీచమైన మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టీ పట్టిన సంస్కృత పద్యాలు కాదు అసలు విషయం ఏమిటి అన్నది అసెంబ్లీలో మాట్లాడిన మాటల ద్వారా తెలుస్తుంది అని నాని బాలయ్య మీద సెటైర్లు పేల్చారు.

నారా బాలయ్యట :

ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా బాలయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ కాదని నారా బాలయ్య అని ఆయన సెటైర్లు పేల్చారు. చంద్రబాబుకు అనుకూలంగా బాలయ్య వ్యవహరిస్తూ ఎపుడో నారా వారి మనిషి అయిపోయాడని ఆయన హాట కామెంట్స్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలు దిగజారుడుగా ఉన్నాయని ఆయన జగన్ మీద చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద అయితే బాలయ్య ఎందుకు అసెంబ్లీలో మాట్లాడారో తెలియదు, ఆ మాటలు కూడా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలియదు కానీ గత నాలుగేళ్ళుగా ఆయనకు దక్కిన రాజయోగం అవార్డులు పేరు అన్నీ కూడా ఈ దెబ్బకు ఇబ్బందిలో పడిపోయాయనే అంటున్నారు.