Begin typing your search above and press return to search.

అద్భుతమైన డెస్టినేషన్... నమో భారత్ ట్రైన్

దేశంలో నమో భారత్ రైళ్ళ ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలిసిందే. భారతీయ రైల్వే ప్రస్థానంలో ఇది ఒక కీలక ఘట్టంగా చూడాల్సి ఉంటుంది.

By:  Satya P   |   23 Nov 2025 2:00 AM IST
అద్భుతమైన డెస్టినేషన్... నమో భారత్ ట్రైన్
X

దేశంలో నమో భారత్ రైళ్ళ ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలిసిందే. భారతీయ రైల్వే ప్రస్థానంలో ఇది ఒక కీలక ఘట్టంగా చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నమో భారత్ రైళ్లను నమో భారత్ రైలు అనేది భారతదేశంలో ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ గా ఉంది. ఇలా ప్రవేశపెట్టిన సెమీ-హై-స్పీడ్ రైలు సేవగా వీటిని చెప్పుకుంటారు. ఈ రైళ్లను ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు వేగవంతమైన ప్రయాణానికి అనుగుణంగా రూపొందించారు.

అద్దెకు నమో భారత్‌ రైళ్ళు :

అయితే నమో భారత్ రైళ్ళను ఇక మీదట ప్రైవేట్‌ కార్యక్రమాలకు ముఖ్యమైన వేడుకల కోసం అద్దెకి ఇవ్వాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ ఎన్ సి ఆర్టీసీ ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. దాంతో ఇక మీదట నుంచి నమో భారత్ రైళ్ళు అదిరిపోయే వేడుకలకు పుట్టిళ్ళు కానున్నాయి అన్న మాట. అంటే బర్త్ డే వేడుకలు, అలాఏ పెళ్లి రోజు సంబరాలు, అదే విధంగా పెళ్ళికి ముందు జరిగే ఫోటో షూట్ లతో పాటు ఇతర కీలకమైన కార్యక్రమాలకు వీటిని పూర్తిగా వాడుకోవచ్చు. ఆ విధంగా అద్దెకి ఇచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నమో భారత్ రైలు బోగీలను ఈ విధంగా అద్దెకు ఇచ్చేలా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ ఎన్ సీఆర్టీసీ గుడ్ డెసిషన్ తీసుకుంది.

అద్భుతమైన డెస్టినేషన్ :

ఇదిలా ఉంటే వేడుకలు చేసుకోవడానికి ఎన్నో ప్రాంతాలను ఎంచుకుంటారు. అయితే రైలులో కార్యక్రమాలు నిర్వహించడం ఒక రకంగా చూస్తే కొత్త అనుభూతిగా చెబుతున్నారు వెరీ గుడ్ డెస్టినేషన్ పాయింట్ గా వీటిని చూస్తున్నారు. వ్యక్తిగతంగానూ వీటిని అద్దెకి తీసుకోవచ్చు. అలాగే సంస్థలు కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కానీ ఈ సదుపాయాన్ని బాగా వినియోగించుకోవచ్చు అని అంటున్నారు.

కదులుతున్న రైళ్ళు సైతం :

ఇదిలా ఉంటే ఏదైనా ఒక రైల్వే స్టేషన్లలో నిలిపి ఉంచిన బోగీలను గానీ అలాగే కదులుతున్న నమో భారత్‌ రైలు బోగీలనుగానీ వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. అలా వారు అద్దెకు తీసుకోవచ్చు. ఇక నమో భారత్ రైళ్లలో సంబరాలు ఎలా చేసుకుంటారు ఏమిటి అన్నది తెలియచేసేలా దుహాయ్ డిపో వద్ద ఒక నమూనా బోగీని నిరంతరం అలంకరించి అందరికీ అందుబాటులో ఉంచుతారు. ఇక ఈ రైలులో కొన్ని బోగీలకు బుకింగ్‌ చార్జీలను చూస్తే కనుక ప్రతీ గంటకు అయిదు వేల రూపాయలుగా ఉంటుంది. ఇక ఈ భోగీలలో తాము చేసుకునే సంబరాలకు అవసరమైన డెకరేషన్‌ చేసుకునేందుకు ఇంకో అర్ధ గంట సమయం ఇస్తారు అలా గంటన్నర సమయంలో వేడుకలకు చార్జి తీసుకుంటారు. అన్న మాట. వీలుని బట్టి మరో గంట పొడిగించుకోవచ్చు

కండిషన్స్ అప్లై :

అయితే నమో భారత్ రైళ్ళలో ఈ తరహా వేడుకలు సంబరాలు చేసుకునేందుకు ఉద్యం ఆరు గంటల నుంచే రాత్రి పదకొండు గంటల మధ్య మాత్రమే అనుమతిస్తారు. అంతే కాదు ఈ వేడుకలు జరుపుకునే వారు ఆ రైళ్లలో ఉండే సాధారణ ప్రయాణీకుల యాక్టివిటీస్ కి ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది. వారికి ఏ మాత్రం అసౌకర్యం కూడా కల్పించకుండా చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వేడుకల విషయంలో పర్యవేక్షణ అంతా ఎన్ సీఆర్టీసీ అధికారులు భద్రతా సిబ్బంది స్వయంగా సూపర్ వైజ్ చేస్తారు. ఇక ఢిల్లీ ఢిల్లీ-మేరఠ్‌ కారిడార్‌లోని ఆనంద్‌ విహార్‌, ఘజియాబాద్‌, మేరఠ్‌ సౌత్‌ స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండడంతో అక్కడ వారికి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం ప్రైవేట్ వేడుకలకే కాదు సినిమా షూటింగులకూ ఈ బోగీలను అద్దెకి ఇస్తారు అలాగే డాక్యుమెంటరీలు ఎవరైనా తీయాలనూంటే వారికి ఇస్తారు. మొత్తానికి ఎన్ సీఆర్టీసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరి వినియోగం ఏ రేంజిలో ఉంటుందో చూడాల్సి ఉంది.