నగరి లోకల్ బాడీ: రోజాకు రాజకీయ పరీక్ష.. !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని నగరి మునిసిపల్ ఎన్నికలు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాకు రాజకీయ పరీక్షగా మారాయా? ఆమె అస్తిత్వానికి ఈ ఎన్నికలు కీలకంగా ఉన్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 26 Aug 2026 5:00 AM ISTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని నగరి మునిసిపల్ ఎన్నికలు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాకు రాజకీయ పరీక్షగా మారాయా? ఆమె అస్తిత్వానికి ఈ ఎన్నికలు కీలకంగా ఉన్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రోజా ఓడిపోయి.. టీడీపీ తరఫున గాలి భాను ప్రకాష్ నాయుడు విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆ విజయాన్ని రోజా తక్కువ చేసి చూపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భాను తన విజయం పక్కన పెట్టి.. ఇప్పుడు మునిసిపాలిటీలో తన సత్తా చాటాలని నిర్ణ యించుకున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష పోరు నేపథ్యానికి తోడు బ్యాలెట్ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల ను ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మునిసిపాలిటీ పరిధిలోని అన్ని కౌన్సిళ్లను కలియ దిరుగుతున్నారు. తన వ్యూహాలకు అనుగుణంగా ప్రజలను కలుస్తున్నారు. సమస్యలు పరిష్కరించేందు కు ఇప్పటికే ప్రయత్నం చేసిన భాను.. ఇప్పుడు వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా రోజా విషయాన్ని ప్రస్తావిస్తూ.. `విజిటింగ్ లీడర్` అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి పార్టీ తరఫున ఓడిపోయిన రోజా.. తర్వాత.. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఎక్కడా కనిపించ డం లేదు. ఇది భానుకు కలిసి వస్తున్న పరిణామం. దీనికి తోడు ఆడుదాం ఆంధ్ర కేసు కూడా ఆమెను వెంటాడుతోంది. ఈ పరిణామాలు .. ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న అంచనా ఉంది. అందుకే ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా భాను దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
నగరిలో జనసేన ప్రభావం ఉన్నప్పటికీ.. భానుకు అనుకూలమైన వాతావరణం ఉండడం.. టీడీపీ కార్యక ర్తలు, నాయకుల మధ్య సఖ్యత వంటివి ఎమ్మెల్యే రాజకీయాలకు కలిసి వస్తున్నాయి. పైగా.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత అప్పగించిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన సత్తా నిరూపించుకునేందుకు ఎమ్మెల్యే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, నగరి మాజీ ఎమ్మెల్యేగా రోజా.. ఇప్పటి వరకు ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. పైగా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో మునిసిపల్ ఎన్నికలు ఆమెకు రాజకీయ పరీక్షగా మారనున్నాయి. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు రోజాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
