నాగబాబు ధర్మాగ్రహం...మౌన రాగం !
నాగబాబు ఇపుడు మెగా బ్రదర్ మాత్రమే కాదు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఏమి మాట్లాడినా అది వేరేగా సంకేతాలు ఇస్తుంది అని అంటున్నారు.
By: Satya P | 15 Oct 2025 12:56 AM ISTసోదరులలో మధ్యముడు మెగా బ్రదర్ గా పేరు గడించిన నాగబాబు సైలెంట్ మోడ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా ఆయన పెద్దగా ఇటీవల కాలంలో రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో నాగబాబు తొలిసారి ఎమ్మెల్సీ హోదాలో పాల్గొన్నారు. శాసనమండలిలో ఆయన కనిపించారు. తన వరకూ సభలో కొన్ని చర్చలలో పాల్గొన్నారు. ఆ తరువాత నుంచి ఆయన వైపు నుంచి పెద్దగా సౌండ్ అయితే లేదు. దాంతో రీజనేంటి అన్నదే చర్చగా ఉంది.
ఆ ఎపిసోడ్ కంటిన్యూ :
ఇక అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులలో ముగుస్తాయనగా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ శాసనసభలో చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఆయన ఈ రోజుకీ ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి తన సోదరుల మీద ఏ మాత్రం ఏ చిన్న విమర్శ వచ్చినా వెంటనే స్పందించేవారుగా నాగబాబు కనిపిస్తారు. ఆయన ఏ మాత్రం తట్టుకోలేరని అంటారు. అంతే కాదు ఆయన అంతే వేగంగా మీడియా ముందుకు వచ్చి తన రియాక్షన్ ఇస్తూనే కౌంటర్లు వేస్తారు అని గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం దానికి భిన్నంగా మౌనమే ఆయన భాష అయింది. ఇది ఒకింత ఆశ్చర్యమే అంతే కాదు ఆయన వైపు నుంచి ఏ విధమైన రియాక్షన్ రలేదని కూడా అంతా అనుకున్నారు.
అందుకే అలాగనా :
నాగబాబు ఇపుడు మెగా బ్రదర్ మాత్రమే కాదు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఏమి మాట్లాడినా అది వేరేగా సంకేతాలు ఇస్తుంది అని అంటున్నారు. దాంతోనే ఆయన పూర్తి సంయమనం పాటించారు అని అంటున్నారు. ఇక ఈ విషయంలో ఆయన మాత్రం అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు. అయితే మొదట్లో ఆయన రియాక్ట్ కావాలని అనుకున్నా కూడా తన వారి సూచనలతోనే వెనక్కి తగ్గారని అంటున్నారు.
సోషల్ మీడియా వార్ :
ఇక ఈ రోజుకీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం మీద వార్ అయితే ఎక్కడా ఆగడం లేదు, మెగా ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్యగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ హిందూపురంలో మంత్రి కావాలి మా హీరో అంటూ కూడా కొత్త డిమాండ్లు పెడుతున్నారు. ఇవన్నీ ఇలా సాగుతూంటే మెగా బ్రదర్ మాత్రం పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఒక విధంగా ఏపీ రాజకీయాల మీద కూడా ఏ విధమైన ట్వీట్ చేయడంలేదని గుర్తు చేస్తున్నారు.
మౌనమే భాషగా :
ఇక నాగబాబు తనదైన మౌనంతోనే గడుపుతున్నారని అంటున్నారు. ఆయన ఈ విషయంలో తన సోదరుల సలహా మేరకే అలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు మళ్ళీ యాక్టివ్ కావాలంటే కొంత టైం పడుతుందని అంటున్నారు. అయితే రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగడమే ఎవరైనా చేసేది. పవన్ కళ్యాణ్ అయితే తన విధులలో చురుకుగా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఇష్యూని పెంచి పెద్ద చేయడం కంటే లైట్ తీసుకోవడం ద్వారానే తమ వివేచన చూపించాలని ఆలోచిస్తున్న క్రమంలోనే ఈ విధంగా సాగుతున్నారని అంటున్నారు. మొత్తం మీద నాగబాబు ఎక్స్ ఎపుడు యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది అన్నదే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
