నాగబాబు గుర్తించారో లేదో కానీ... ట్రోల్స్ వేరే లెవెల్
మెగా ఫ్యాన్స్ అంటే వీరాభిమానులే కాదు వీరావేశం ఉన్న వారే. వారికి కోపం వస్తే ఎంత మాటైనా అనేస్తారు. తాజాగా వారి కోపం మెగా బ్రదర్ నాగబాబు మీదకు వెళ్ళింది.
By: Satya P | 31 Dec 2025 12:52 AM ISTమెగా ఫ్యాన్స్ అంటే వీరాభిమానులే కాదు వీరావేశం ఉన్న వారే. వారికి కోపం వస్తే ఎంత మాటైనా అనేస్తారు. తాజాగా వారి కోపం మెగా బ్రదర్ నాగబాబు మీదకు వెళ్ళింది.ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీలో ఏదో దరిద్రాన్ని తెచ్చి పెట్టడం నాగబాబుకు ఎపుడూ అలవాటే అంటూ మండిపోయే కామెంట్స్ చేశారు. ఇంతకీ నాగబాబు చేసిన తప్పేంటి, ఆయన ఎందుకు అలా మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల ట్రోల్స్ కి గురి అవుతున్నారు అంటే నాగబాబు తాజాగా వదిలిన ఒక వీడియో బైట్ కారణం అని అంటున్నారు.
శివాజీ కామెంట్స్ కి రివర్స్ లో :
హీరోయిన్ల వస్త్రధారణ గురించి సినీ నటుడు శివాజీ ఇటీవల చేసిన కామెంట్స్ హీటెక్కించాయి. దాంతో అనేక మంది అనుకూలంగా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఒక వీడియో బైట్ వదిలి మరీ మహిళల ఇష్టాఇష్టాలు నియంత్రించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అని విమర్శించారు. పండితుడి నుంచి పామరుడి దాకా మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు అని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఫైర్ అయ్యారు. మహిళకు వాళ్ళకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు అని సపోర్టుగా మాట్లాడారు. దాంతో నాగబాబు కామెంట్స్ అప్పటి నుంచే తెగ ట్రోల్ అవడం మొదలయ్యాయి.
జనసేనలోనూ :
ఇది ఎంతదాకా వెళ్ళింది అంటే జనసేన క్యాడర్ కూడా నాగబాబు వ్యాఖ్యల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అనేక సమస్యలు ఉంటే ఈ చిన్న సమస్యను పట్టుకుని నాగబాబు రంగంలోకి దిగడం ఏంటని వారు అంటున్నారు. అంతే కాదు సున్నితమైన వ్యవహారాలలో పెద్దాయనగా ఉండాల్సిన ఆయన ఒక వైపు తీసుకుని మాట్లాడడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మహిళల జుగుప్సాకర వస్త్రధారణ మీద సాధారణ జనంలో వ్యతిరేకత ఉందని ఆ సంగతి గుర్తించారో లేదో కానీ నాగబాబు తన ధోరణిలో చేసిన వ్యాఖ్యలు సంప్రదాయ మహిళల నుంచి ఆగ్రహాన్ని గురి అయ్యాయి. ఇక ఆయన మహిళలకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలకు వారి నుంచి రావాల్సిన సపోర్ట్ కూడా రాలేదు, కారణం ఆయన మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, కాకపోతే మీ వెంట రక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడంతో కూడా ఆయన సూచనలు వారిని సైతం మెప్పించలేక పోయాయని అంటున్నారు.
ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీలో :
నాగబాబు గురించి ఒక కామనర్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీలో ఏదో ఒక దరిద్రాన్ని తెచ్చి పెడుతూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీలో ఏదో వివాదం తెస్తే దానిని తీర్చలేక చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతారని అన్నారు. శివాజీ ఇష్యూలో తల దూర్చి నాగబాబు కూడా అందరి చేత ట్రోల్స్ చేయించుకుంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అయిన కామనర్ అభిప్రాయపడ్డారు. పెద్దలుగా ఉండి ఏదీ చెప్పకూడదు, సూచించకూడదు అన్నదే మీ విధానమా అని నాగబాబుని ప్రశ్నించారు. మీరు మాత్రం అన్నీ చెప్పేయవచ్చా అని హాట్ కామెంట్స్ చేశారు.
ఎవరూ నచ్చడం లేదు :
వస్త్రధారణ విషయంలో శివాజీ ఒక మాట చెబితే దానిని ఎందుకు వ్యతిరేకించడం అని కామనర్ అంటున్న మాటలు నాగబాబుకు ఇబ్బందికరంగానే మారుతున్నాయని అంటున్నారు. శివాజీ అన్న దాంట్లో తప్పుంటే ఆయన కర్మకు ఆయన పోతారని తొక్కాలని పనిగట్టుకుని ఎవరైనా చూస్తే మాత్రం వారే కొట్టుకుపోతారని కామనర్ చెప్పడం విశేషం. ఈ విషయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక నాగబాబు చేసిన ఈ కామెంట్స్ మీద బయట గ్రౌండ్ లెవెల్ లో అయితే పెద్దగా ఎవరూ నచ్చడం లేదనే అంటున్నారు. అనవసరంగా పెద్దాయన ఈ వివాదంలోకి పోయి పోయి తలదూర్చారేంటి అన్నదే అటు జనసేన ఇటు మెగా అభిమానుల బాధగా ఆవేదనగా అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.
