Begin typing your search above and press return to search.

ఎక్కువ సీట్లలో జనసేన ...నాగబాబు సంచలన వ్యాఖ్యలు !

ఏపీలో ఒక వైపు సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కసరత్తు సాగుతోంది. అదే సమయంలో జనసేన నుంచి ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు.

By:  Satya P   |   19 Oct 2026 11:00 PM IST
ఎక్కువ సీట్లలో జనసేన ...నాగబాబు సంచలన వ్యాఖ్యలు !
X

ఏపీలో ఒక వైపు సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కసరత్తు సాగుతోంది. అదే సమయంలో జనసేన నుంచి ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. ఈ పంచాయతీ అలా ఉండగానే జనసేన ఎమ్మెల్సీ, కీలక నాయకుడు నాగబాబు అయితే అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. అల్లూరి జిల్లాలో మొత్తం 50 నుంచి అరవై స్థానాలలో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేయడం విశేషం. అరకులో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ నాగబాబు ఈ కామెంట్స్ చేయడంతో ఇపుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

గిరిజనులతో మమేకం :

జనసేన పార్టీకి అరకు ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉందని నాగబాబు చెప్పారు. ఎన్నో గిరిజన సమస్యలను జనసేన పరిష్కరించింది అని నాగబాబు గుర్తు చేశారు. అంతే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫోకస్ ఉందని అన్నారు. ఎన్నో మారుమూల ప్రాంతాలలో అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కోట్లాది రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. గురిజనుల అభ్యున్నతి కోసం జనసేన పాటు పడుతుందని నాగబాబు స్పష్టం చేశారు. అరకు నియోజకవర్గంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అవి అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు. ఇక ఎంపీటీసీ స్థానాలు సుమారుగా 85 వరకు ఉంటాయి. గ్రామ పంచాయతీలు 130 కంటే ఎక్కువ ఉన్నాయి.

అల్లూరి జిల్లాలో చూస్తే :

అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలను కలిపి ఉమ్మడిగా చూస్తే 244 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 11 జెడ్పీటీసీలు, 172 ఎంపీటీసీ స్థానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని మండలాలు చూస్తే పాడేరు, మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలున్నాయి.

అరవై శాతం అంటే :

ఇందులో అరవై శాతం అంటే జనసేనదే మెజారిటీ వాటా అవుతుంది. అంతే కాదు వందలాది ఎంపీటీసీలు దక్కనున్నాయి. అలాగే జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా జనసేనకే ఎక్కువగా వెళ్తాయి. అయితే అల్లూరి జిల్లలఓ టీడీపీ కూడా బలంగానే ఉంది. అలాగే ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా కూడా తమ వారికి సీట్ల కోసం పట్టుబడతారు. పైగా 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఈ ఎన్నికలను కీలకంగా చేసుకుంటారు. దాంతో జనసేనకు అరవై శాతం సీట్లు కేటాయించేందుకు టీడీపీ నుంచి ఒప్పుకుంటారా అన్నదే పెద్ద చర్చగా ఉంది మరి.