Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్స్ ముగ్గురూ ప్రజా ప్రతినిధులు

మెగా బ్రదర్ గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఇపుడు ఎమ్మెల్సీగా పెద్దల సభకు వచ్చారు.

By:  Satya P   |   19 Sept 2025 9:48 AM IST
మెగా బ్రదర్స్ ముగ్గురూ ప్రజా ప్రతినిధులు
X

మెగా బ్రదర్ గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఇపుడు ఎమ్మెల్సీగా పెద్దల సభకు వచ్చారు. ఆయన మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కోటాలో విజయం సాధించారు. అప్పటికి బడ్జెట్ సెషన్ పూర్తి కావడంతో రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు ఆయనకు తొలి సభలుగా మారాయి. ఇక ఆయన పెద్దల సభకు వచ్చి వెనక సీట్లో కూటమి పక్షనా అధికార బెంచీల వైపు కూర్చున్నారు. ఆయనకు సభ్యులు అంతా అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు తన సోదరుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలసి ఆయన విషెస్ తీసుకుని మరీ సభలోకి నాగబాబు అడుగుపెట్టారు.

పరిశీలనలోనే :

ఇక తొలిరోజు నాగబాబు సభలో సభ్యుల మధ్య వివిధ అంశాలకు సంబంధించి జరిగిన చర్చలను చాలా నిశితంగా పరిశీలించారు. అలాగే ఎవరేమి మాట్లాడుతున్నారు. ఏ విషయం ఏమిటి అన్నది కూడా ఆయన లోతుగా గమనిస్తున్నట్లుగా కూడా అర్ధం అయింది. నాగబాబు కూటమి ఎమ్మెల్సీ పైగా జనసేనలో కీలక నేత కావడంతో ఆయన ముందు ముందు సభలో తన వాణిని గట్టిగానే వినిపించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఆ హోదాలో అనుకుంటే :

అయితే నాగబాబు ఒక సాధారణ ఎమ్మెల్సీగా సభలోకి వచ్చారు. మంత్రులు సీనియర్లు అంతా ట్రజరీ బెంచీలలో ముందు వరసలో ఉంటే ఆయన కాస్తా వెనక వరుసలో ఆసీనులు అయ్యారు. నిజానికి నాగబాబుకు ఎమ్మెల్సీ కంటే ముందే మంత్రి పదవి రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఏడాది క్రితం ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా చంద్రబాబు ట్వీట్ చేసి సంచలనం రేపారు. దాంతో నాగబాబుకు ఎమ్మెల్సీయే ఆలస్యం మంత్రి అన్న మాట అని చర్చకు తెర లేచింది. ఆయన కోసం అనేక మంత్రిత్వ శాఖలను కూడా మెయిన్ స్ట్రీం మీడియా సోషల్ మీడియా కూడా రెడీ చేసి రోజుకు ఒకటి తగిలిస్తూ కావాల్సినంత ప్రచారం చేసింది. కానీ నాగబాబు మత్రం ఎమ్మెల్సీగానే సభలోకి వచ్చారు.

పవన్ చేతిలోనే అంతా :

అయితే బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన చేతిలోనే నాగబాబు పదవి అన్నది ఉంది అని ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో పవన్ చెప్పారు. తాను ఆ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెప్పారు. అయితే పవన్ మదిలో మాత్రం నాగబాబుని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా చూడాలని ఉందని అంటున్నారు. అందుకే ఆయా ఆగారని చెబుతున్నారు 2026లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే అయిదు రాజ్యసభ సీట్లలో జనసేనకు ఒకటి ఖాయం. అది నాగబాబుకు ఇచ్చి ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభించేలా పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే తన సోదరుడి విషయంలో ఆయన ఏపీ మంత్రిగా కోరుకోవడం లేదని అంటున్నారు.

మెగా బ్రదర్స్ రికార్డు :

ఇక చూస్తే నాగబాబు చట్ట సభలోకి రావడంతో మెగా బ్రదర్స్ ముగ్గురూ ప్రజా ప్రతినిధులు గా అయినట్లు అయింది ఇది ఒక రికార్డు అని అంటున్నారు. చిరంజీవి 2009లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీకి హాజరయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ 2024లో పిఠాపురంలో గెలిచి ఎమ్మెల్యే మాత్రమే కాదు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములూ చట్ట సభలకు రావడం అరుదైన రికార్డు అని అంటున్నారు.