బీహార్ ఎలక్షన్స్: మైనారిటీ ఓట్లు ఎవరి వైపు?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయిన నేపథ్యంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని.. అవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
By: Garuda Media | 20 Oct 2025 12:00 PM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయిన నేపథ్యంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని.. అవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కీలకమైన ముస్లిం మైనారిటీ ఓట్ల పరిస్థితిపై.. ఆ వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న అంశాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. బీహార్ జనాభాలో ముస్లింలు 17.7% ఉన్నారు, బీహార్ లోని 87 నియోజకవర్గాలలో ముస్లిం జనాభా 20% కంటే ఎక్కువగా ఉంది.
బీహార్ లోని ముస్లిములలో దాదాపు 75% మంది ఉత్తర బీహార్‌లో ఉండగా, సీమాంచల్, కతిహార్, పూర్నియా, అరారియా జిల్లాలలో జిల్లాల్లో వీరి సంఖ్య 40% కంటే ఎక్కువగా ఉంది, కిషన్‌గంజ్ జిల్లాలో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. హిందువుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడి జనాభాలో 68% కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి బీహార్ ముస్లింలు ఎల్లప్పుడూ ఎన్నికలలో తక్కువ అబ్యర్దుల ప్రాతినిధ్యంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య ఎప్పుడూ 10% దాటలేదు. బీహార్ లో ఎన్నికలు రెండు దశలలో జరగుతున్న నేపథ్యంలో.. రెండవ దశ సీమాంచల్‌తో సహా అనేక కీలకమైన నియోజకవర్గాలలో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల కేటాయింపు విషయానికి వస్తే బిజెపి ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రకటించిన 53 మంది అభ్యర్థులలో ఆరుగురు ముస్లిములు, అధికార జనతాదళ్(యు) నలుగురిని, ఎల్జీపీ ఒకరిని నిలబెట్టాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 40 మందిని నిలబెట్టడానికి హామీ ఇచ్చి 21 మందికి అవకాశం ఇచ్చింది. 101 సీట్లలో పోటీ చేస్తున్న అధికార జనతాదళ్ (జేడీయూ) ఇప్పటివరకు నలుగురు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ఇంకా తన తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ ఇప్పటివరకు ముగ్గురు ముస్లింలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది.
చిన్న పార్టీలలో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధికార ఎన్డీయేలో భాగంగా 29 సీట్లలో పోటీ చేస్తోంది ఈ పార్టీ ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి మొహమ్మద్‌ను బరిలోకి దింపుతోంది. ఈశాన్య బీహార్‌లోని బహదూర్‌గంజ్ స్థానంలో కలీముద్దీన్ ఉన్నారు. 2020లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దఫా వీరి ఓటు బ్యాంకు ఏ పార్టీకీ అనుకూలంగా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిని గమనించిన ఎంఐఎం వంటి ముస్లిం ప్రాబల్య పార్టీలు వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
