Begin typing your search above and press return to search.

విలన్ అనుకుంటే హీరో అయ్యాడు

మురళీమోహన్ తొలి సినిమా జగమే మాయ. ఇది 1973 లో రిలీజ్ అయింది. ప్రఖ్యాత నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో మురళీమోహన్ కి మొదట ఆఫర్ ఇచ్చింది విలన్ వేషం.

By:  Satya P   |   23 Jun 2026 8:29 PM IST
విలన్ అనుకుంటే హీరో అయ్యాడు
X

తెలుగు సినీ సీమలో యాభై ఏళ్ళ ప్రస్థానం కొనసాగించడం బహు కష్టం. అది ఏ కొందరికో సాధ్యపడింది. ఆ జాబితాలో మురళీమోహన్ కూడా చేరారు. ఆయన సినీ రంగానికి మూడున్నర పదుల వయసులో వచ్చారు. అంటే లేట్ గానే ఎంట్రీ అని చెప్పాలి. అయినా సరే తన టాలెంట్ తో పాటు నిబద్ధత అంకితభావం తో సినీ సీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఆయన దేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ బిరుదాంకితుడయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్న రెండోవిడత పద్మ అవార్డులు- 2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ నటుడు, చిత్ర నిర్మాతగ మాగంటి మురళి మోహన్ కళా విభాగం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని మంగళవారం అందుకున్నారు.

జనం మదిలో సదా ఉంటూ :

మురళీమోహన్ తొలి సినిమా జగమే మాయ. ఇది 1973 లో రిలీజ్ అయింది. ప్రఖ్యాత నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో మురళీమోహన్ కి మొదట ఆఫర్ ఇచ్చింది విలన్ వేషం. హీరోగా గిరిబాబుని అనుకున్నారు. అయితే ఆ తరువాత మురళీమోహన్ ఫీచర్స్ చూసి హీరో ఆయనే అని చిత్ర బృందం ఫిక్స్ అయి హీరోని చేసింది. అలా ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. అందులో నీ మదిలో నేనే ఉంటే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ తో మురళీమోహన్ అక్కినేని శోభన్ బాబుల ఇద్దరికీ వారసుడు అనిపించుకున్నారు. అంతే ఆ తరువాత ఆయన జనం మదిలో నిలిచిపోయి వందలాది సినిమాలు నటించడమే కాదు నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు.

అసలు పేరు వెనక :

మురళీమోహన్ అసలు పేరు రాజబాబు. ఆయన సినీ ఇండస్ట్రీకి వచ్చేసరికే రాజబాబు అనే స్టార్ కమేడియన్ ఉండడంతో ఆయనకు మురళీ మోహన్ అన్న పేరుని జగమే మాయ చిత్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మార్చి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. అలా సినీ రంగానికి ఒక మంచి నటుడు ఉదాత్త పాత్రలను అలవోకగా అద్భుతంగా పోషించే నటుడు దొరికారు. ఆయన చేసిన ప్రతీ సినిమా ఆ రోజుల్లో యూత్ ని ఎట్రాక్ట్ చేసేది. అంతే కాదు ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ఇక చిన్నతనం నుంచే మురళీమోహన్ నాటకాల మీద మంచి అభిరుచి ఉంది. అలా విజయవాడలో ఆయన నాటకాలలో నటించడం మొదలు పెట్టారు.

సూపర్ స్టార్ క్రిష్ణకు ఫ్రెండ్ :

మరో విశేషం కూడా ఉంది. మురళీమోహన్ సూపర్ స్టార్ క్రిష్ణకు ఫ్రెండ్. ఇద్దరూ కలసి ఏలూరిలో డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. క్రిష్ణ మొదట సినీ రంగం ప్రవేశం చేస్తా కాస్తా ఆలస్యంగా మురళీమోహన్ సినీ ఫీల్డ్ కి వచ్చారు. మురళీ మోహన్ సినీ రంగంలో అజాత శతృవుగా పేరు గడించారు. ఆయన అందరితో బాగుంటారు. అందరికీ కావాల్సిన వారుగా ఉంటారు. అందుకే టాప్ సీనియర్లు అయిన అలనాటి ఎన్టీఆర్ ఏఎన్నార్, క్రిష్ణ శోభన్ బాబులతో కలసి నటించగలిగారు. ఇక దర్శకరత్న దాసరి తీసే బడ్జెట్ మూవీస్ కి తొలి చాయిస్ మురళీ మోహన్. అలా ఎన్నో హిట్లు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. టాలీవుడ్ లో నటుల కోసం ఏర్పాటు చేయబడిన మాకు మురళీమోహన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఎంతగానో సేవ చేశారు. ఆయనకు పద్మశ్రీ రావడం ఒక ఎత్తు అయితే జూన్ 24న ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం మరో తీపి గుర్తు. హ్యాపీ బర్త్ డే అండ్ కంగ్రాట్స్ మురళీమోహన్ గారు.