దేశంలో హ్యాపీ సిటీ లిస్ట్ లో విశాఖ హైదరాబాద్ ఎక్కడ ?
హ్యాపీ ఎక్కడ ఉంటుంది అంటే మనసులో అన్నది తాత్వికుల సమాధానం. అయితే అందరూ తాత్వికులు కాలేరు కదా.
By: Satya P | 8 Nov 2025 8:59 AM ISTహ్యాపీ ఎక్కడ ఉంటుంది అంటే మనసులో అన్నది తాత్వికుల సమాధానం. అయితే అందరూ తాత్వికులు కాలేరు కదా. భౌతిక పరమైన అంశాలను చూసి ఆనందించే వారే అత్యధికం. అలాంటివారికి సంతోషం కలిగించే విషయాలు కావాలి. మరి అన్నీ ఒకే చోట పోగు చేసినట్లుగా ఎక్కువ ఆనందం అందించే నగరాలు దేశంలో ఉన్నాయా అంటే ఎందుకు లేవు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో అత్యుత్తమమైనది ఏమిటి అంటే అదే ఆసక్తికరంగా ఉంది. దీని మీద జరిగిన తాజా సర్వేలో ఒక మహా నగరం ఆ క్రెడిట్ ని కొట్టేసింది.
ముంబైకి గౌరవం :
దేశంలో ముంబై మహా నగరం అత్యంత సంతోషకరమైన నగరంగా ఈ సర్వే ప్రకారం ఉంది. ప్రతీ ఏటా ఈ తరహా సర్వేలను నిర్వహిస్తూంటారు. అందులో అడిగే ప్రశ్నలు ఏమిటి అంటే మీరు మీ నగరంలో నివసిస్తున్నందుకు ఆనందంగా ఉన్నారా అని. టైం అవుట్ నిర్వహించిన కొత్త సర్వేలో ఈ మేరకు మంచి ర్యాంక్ ని ముంబై కొట్టేసింది. కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు ఆసియాలోనే హ్యాపీ సిటీగా ముంబై నిలిచి ఉండడం విశేషం.
మంచి రేటింగ్ తో :
ఇక ముంబైలో నివసించే వారిలో 94 శాతం మంది తమ సిటీ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని స్పష్టంగా సర్వేకు చెప్పారు. అదే సమయంలో దేశంలో మిగిలిన నగరాల వారు కూడా తమ సిటీకే ఎక్కువ ఓటు వేశారు. అయితే అవి 89 శాతం దగ్గరే నిలిచిపోవడంతో ముంబై మంచి రేటింగ్ ని సాధించి టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక ఇతర నగరాలు ప్రాంతాలతో పోలిస్తే ముంబై చాలా బెస్ట్ ప్లేస్ అని కూడా చాలా మంది చెప్పారు.
అందులోనూ ఫస్ట్ :
ముంబై కేవలం సంతోషకరమైన నగరమే కాదు బిలియనీర్లలో కూడా టాప్ ప్లేస్ లో ఉంది. ముంబై మహా నగరంలో మొత్తం 92 మంది బిలియనీర్లు ఉంటున్నారు అని సర్వే వెల్లడించింది. ఇక గత ఏడాది కొత్తగా 26 మంది ధనవంతులు కూడా ముంబైలోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ధనవంతులను ముంబై అలా ఆకర్షిస్తోంది అని అంటున్నారు. దీంతో ముంబైలోని బిలీయనీర్ల మొత్తం సంపద 445 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 47 శాతం ఎక్కువ అని చెబుతున్నారు.
నడిపించే రంగాలు :
ఇక ముంబై సంపద అంతా రెండు కీలక రంగాల నుంచి వస్తోంది అని అంటున్నారు. అది ఎనర్జీ ఫార్మాస్యూటికల్ రంగాలుగా చెబుతున్నారు. ముఖేష్ అంబనీలు లాంటి దిగ్గజాలు ముంబైలోనే ఉంటున్నారు. మొత్తానికి చూస్తే భారత దేశానికి వాణిజ్య నగరం ఆర్థిక నగరం అని ముంబైని అంతా అంటారు. మరి సంపద ఉన్న చోటనే సంతోషం ఉంటుందా అంటే ఇపుడు ఆ క్రెడిట్ కూడా ముంబైకే దక్కడం విశేషం. మన విశాఖ హైదరాబాద్ కూడా సంతోష నగరాలే కానీ రేటింగ్ లో వెనకబడి ఉండడం వల్లనే ముంబైకి ఈ హోదా దక్కింది. అదన్న మాట మ్యాటర్.
