Begin typing your search above and press return to search.

ముద్రగడ కోరిక జగన్ తీరుస్తారా ?

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీనియర్ మోస్ట్ లీడర్, ముక్కు సూటి మనిషి. ఆయన కాపుల ఉద్యమంతో తన రాజకీయ జీవితంలో పుణ్య కాలం గడిపేశారు.

By:  Satya P   |   23 March 2026 1:00 PM IST
ముద్రగడ కోరిక జగన్ తీరుస్తారా ?
X

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీనియర్ మోస్ట్ లీడర్, ముక్కు సూటి మనిషి. ఆయన కాపుల ఉద్యమంతో తన రాజకీయ జీవితంలో పుణ్య కాలం గడిపేశారు. లేకపోతే ఆయన కీలక పదవులు అందుకునే వారు అని అంటారు. అయితే ఆయన ఎక్కువగా టీడీపీని చంద్రబాబుని విమర్శిస్తూంటారు అని పేరుంది. అదే వైసీపీకి నచ్చింది. దాంతో వైసీపీ ఆయనను దగ్గరకు తీసుకుంది. ఒక దశలో జనసేనలోకి వెళ్లాలని చూసిన ముద్రగడ చివరికి వైసీపీలోనే కుదురుకున్నారు. అయితే 2024 ఎన్నికలలో ముద్రగడ మీద వైసీపీ చాలా హోప్స్ ని పెట్టుకుంది. దానికి తగినట్లుగానే పెద్దాయన భారీ స్టేట్మెంట్స్ ఇచ్చారు నేరుగా పవన్ తోనే ఢీ కొట్టారు. పిఠాపురంలో పవన్ ని ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అని ఎవరూ అడగకుండానే పెను సవాల్ చేశారు. చివరికి పవన్ భారీ ఆధిక్యంతో గెలవడంతో ముద్రగడ తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది.

పెద్దరికం కోసం :

ఇక చూస్తే వైసీపీలో ముద్రగడకు కొంత సముచిత స్థానం అయితే అధినేత జగన్ ఇచ్చారు. ఆయనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించారు. అలాగే ఆయన కుమారుడికి పత్తిపాడు ఇంచార్జి పదవి ఇచ్చారు. ఈ విధంగా వైసీపీ అధినాయకత్వం ముద్రగడ పెద్దరికం కాపాడేలా చూస్తోంది అని అంటున్నారు. అయితే ముద్రగడ అయితే ఇంతకు మించి పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండేలా కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

గోదావరి జిల్లాలలో :

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో తనకు విశేష అధికారాలను ఇచ్చే కీలక బాధ్యతలు అప్పగించాలని ముద్రగడ కోరుతున్నారని ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఈ రెండు జిల్లాలలో తన హవా ఉంటుంది కాబట్టి తాను చెప్పినట్లుగా పార్టీ అక్కడ ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు అయితే 2024 ఎన్నికల్లో ముద్రగడ చరిష్మా పెద్దా సాగలేదన్నది అధినాయకత్వం గుర్తించింది అని అంటున్నారు. అయినా సరే పెద్దాయనగా ముక్కు సూటి మనిషిగా ఆయనకు గౌరవం ఇస్తూ ఆయన వారసుడికి పదవి ఇవ్వడం వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ వంటివి ఉన్నాయని అంటున్నారు. కానీ గోదావరి జిల్లాల మొత్తం బాధ్యతలను ఆయన చేతిలో పెట్టేందుకు వైసీపీ పెద్దలు అయితే అంతగా సుముఖంగా లేరని అంటున్నారు.

ఓల్డ్ ట్రెండ్ తోనే :

ఇక ముద్రగడ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. అంతే కాదు ఆయన పాత రాజకీయ పోకడలు కూడా ప్రస్తుతం వైసీపీలో నేతలకు సైతం గిట్టడం లేదని అంటున్నారు. అంతే కాకుండా ఆయన కాపులకు ఒకనాడు మద్దతుగా ఉద్యమం నడిపి చివరికి కాడె వదిలేశారు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉంది. ముద్రగడ కాస్తా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడం పట్ల జనసేన వర్గాలతో పాటు కాపులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఇక వైసీపీ నేతలతో ఆయనకు కొన్ని చోట్ల విభేదాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడానికి వైసీపీ అధినాయకత్వం అంత సుముఖంగా ఉండకపోవచ్చు అంటున్నారు. ఒక వేళ తాను కోరక కోరక కోరితే దానిని నో అంటే కనుక అసలే ఆత్మాభిమానం నిండుగా మెండుగా ఉండే ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదే పెద్ద చర్చగా ఉంది అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో. ఏమి జరుగుతుందో.