Begin typing your search above and press return to search.

ముద్రగడని ఎలా ఎక్కడ వాడాలో డిసైడ్ చేసిన జగన్

ఇక ఏ సామాజిక నేపథ్యం అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసిందో అదే నేపధ్యం మెల్లగా మారుతోంది అని వైసీపీ గుర్తిస్తోంది అంటున్నారు.

By:  Satya P   |   5 Oct 2025 2:00 AM IST
ముద్రగడని ఎలా ఎక్కడ వాడాలో డిసైడ్ చేసిన జగన్
X

ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారి నుంచి పుట్టి పెరిగి రాష్ట్ర స్థాయిలో బిగ్ ఫిగర్స్ గా మారిన వారు కొందరు కాపు నేతలు కనిపిస్తారు. వారే వంగవీటి మోహన రంగా. అలాగే ముద్రగడ పద్మనాభం. ఈ ఇద్దరు నేతలు కాపుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే రంగా దారుణ హత్యకు గురి కాగా ముద్రగడ ముక్కుసూటి రాజకీయం ఆయనకు అత్యున్నత రాజకీయ పదవులను దూరం చేసింది. రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నా కూడా ఈ రోజుకీ కాపులు గట్టిగా చెప్పుకునే పేర్లు అయితే ఈ ఇద్దరివే ఉంటాయని చెబుతారు.

వైసీపీలో ముద్రగడ :

ఇక ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన ఆ సమయంలో పవన్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. పవన్ ఎలా గెలుస్తారో చూస్తామని కూడా అన్నారు. కానీ కూటమి ప్రభంజనం వీచింది. దాంతో పవన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఈ దెబ్బకు ముద్రగడ తన ఒంటి పేరునే మార్చుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఆయన తాను చేసిన శపధం మేరకే సుమా. ఆయనను ఎవరూ డిమాండ్ చేయలేదు కూడా. అలా తన ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు ముద్రగడ. అయితే ప్రతికూల రాజకీయాల్లో ఎదురొడ్డి ఓటమి పాలు అయినా ముద్రగడ బ్రాండ్ అలాగే ఉందని అంతా చెబుతారు. దాంతో ఇపుడు ముద్రగడను మళ్ళీ రంగంలోకి దించాల్సిన సమయం ఆసన్నం అయింది అని వైసీపీ భావిస్తోంది అంటున్నారు.

కీలక స్థానంతో :

ఇదిలా ఉంటే ముద్రగడకు పార్టీలో కీలక స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ముద్రగడ ఈ మధ్యనే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. మరో రెండు మూడు నెలలలో ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని అంటున్నారు. దాంతో ముద్రగడ బయటకు వచ్చి పూర్వం మాదిరిగా బిజీగా పాలిటిక్స్ చేస్తారు అని అంటున్నారు. దాంతో ఆయన సేవలను పార్టీలో మరింతగా ఉపయోగించుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను ముద్రగడ చేతిలో పెడతారు అని అంటున్నారు. ముద్రగడకు ఉన్న పట్టు ఆయనకు జనాలతో ఒక బలమైన సామాజిక వర్గంతో నేరుగా ఉన్న అనుబంధం ఇవన్నీ కలసి జగన్ ఆయన సేవలను ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

మారుతున్న సామాజిక నేపథ్యం :

ఇక ఏ సామాజిక నేపథ్యం అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసిందో అదే నేపధ్యం మెల్లగా మారుతోంది అని వైసీపీ గుర్తిస్తోంది అంటున్నారు. తాజాగా చూస్తే ఏపీ అసెంబ్లీలో బాలయ్య మెగాస్టార్ చిరంజీవి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కూటమి నేతల నుంచి ఆశించిన రియాక్షన్ రాలేదని కాపులు భావిస్తున్నారు అని అంటున్నారు. ఎన్నో ఆశలతో కాపులు కూటమికి మద్దతుగా నిలిచారని అవి కూడా నెరవేరడం లేదన్న అసంతృప్తి ఇప్పటికే ఉంది అని అంటున్నారు. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు కూటమిలో చిచ్చు పెట్టేలా బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసినపుడు సభలో ఉన్న చంద్రబాబు ఖండించలేదు అని అంటున్నారు అలాగే పవన్ కూడా ఈ విషయంలో ఇప్పటికీ నోరు మెదపకపోవడం మీద కాపులు ఆవేదనతో ఉన్నారని అంటున్నారు.

ముద్రగడను దింపాల్సిందే :

సరిగ్గా ఈ కీలక సమయంలో ముద్రగడను రంగంలోకి దింపితే పోయిన చోట వెతుక్కున్నట్లు అవుతుందని కాపులను తిరిగి తమ వైపు తిప్పుకున్నట్లు అవుతుందని వైసీపీ బిగ్ స్కెచ్ నే గీస్తోంది అని అంటున్నారు. ఇక ముద్రగడను జగన్ బాగా గౌరవిస్తున్నారు. ఆయన కోరిక మేరకు కుమారుడు గిరికి అసెంబ్లీ ఇంచార్జి పదవి ఇచ్చారు. ఇంకా ముద్రగడ వర్గానికి న్యాయం చేయాలని చూస్తున్నారు. ముద్రగడకు పీఏసీ మెంబర్ గా మంచి పదవిని ఇచ్చారు. ఆయన అనారోగ్యం పాలు అయితే ఆయనకు అండగా నిలబడ్డారు అని అంటున్నారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని ఆయనకు ఇవ్వాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బొత్స సత్యనారాయణ కంటే ముద్రగడ అయితే నూరు శాతం న్యాయం జరుగుతుందని కాపులలో మంచి బలం ఉన్న ఆయనను ముందు పెడితే వైసీపీకి కలసి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి హెల్త్ ఇష్యూస్ తరువాత్ ముద్రగడ రీ ఎంట్రీ రీ సౌండ్ చేసేలా జగన్ పక్కాగా ప్లాన్ చేశారు అని అంటున్నారు.