ఈ 'రాజు'.. ప్రజల రారాజు.. !
అంతేకాదు.. ఆయన మారు వేషాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం.. అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించడం.. విశేషం.
By: Garuda Media | 9 Oct 2025 12:00 PM ISTఆయన పక్కా మాస్ లీడర్. అహం.. అహంకారం అన్నవి ఆయన డిక్షనరీలోనే కాదు.. చేరువగా కూడా లేవు. నిరంతరం.. ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయనే.. టీడీపీ యువ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత.. బలమైన వాయిస్ వినిపించే నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఎం.ఎస్ రాజు. గతంలో టీడీపీ ఎస్సీ సెల్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన.. వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన నాయకుడు. అయితే.. గత ఎన్నికల్లో ఈక్వేషన్ల మేరకు.. ఆయనకు ఇదే జిల్లాలోని మడకశిరకు కేటాయించారు.
ఆ ఎన్నికల్లో సునాయాసంగా విజయం దక్కించుకున్న రాజు.. అనతి కాలంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మాదిరిగా ఆయన.. ఎక్కడా దర్పం ప్రదర్శించరు. కారు.. కాన్వాయ్.. అంటూ హడావుడి చేయరు. ఓబైకుపై ఉదయాన్నే.. పొలం బాట పడతారు. రైతుల సమస్యలు తెలుసుకుంటారు. ఓ సెంటర్‌లో టీ కొట్టు దగ్గర ఆగి.. పేపర్ చదువుతారు. అక్కడే టీ తాగుతూ.. స్థానికులతో చిట్ చాట్ చేస్తారు. 11 గంటలకు ఇంటికి చేరుకుని.. అరగంటలో రెడీ అయి.. మళ్లీ తాను చేపట్టాలని అనుకున్న కార్యక్రమాలకు వెళ్లిపోతారు.
అంతేకాదు.. ఆయన మారు వేషాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం.. అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించడం.. విశేషం. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. అవినీతి.. లంచాలు వంటివి తన కంటికి కనిపించినా.. తాట తీస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా.. ఎవరినీ వదలకుండా.. ఆయన వ్యవహ రిస్తున్నారు. ప్రతి విషయంలోనూ.. రాజు సునిశితంగానే కాదు.. ఒక్కొక్కసారి కఠినంగా కూడా వ్యవహరి స్తున్నారు. తాను ఎమ్మెల్యే అయినా.. సామాన్యుడిగా ఆయన జీవిస్తున్నారన్నది వాస్తవం.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువయ్యారు. ఏ సమస్య వున్నా.. వెంటనే వాలిపోయి.. ఆ సమస్య ను పరిష్కరించే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరినీ పేరుతో పిలిచే స్వభావం ఉన్న రాజుకు నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని అంటారు. ఒకవైపు ప్రభుత్వ కార్యక్ర మాలను సమన్వయం చేస్తూ.. మరోవైపు.. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రాజు.. ప్రజల రారాజు అనే పేరును తెచ్చుకోవడం గమనార్హం. పార్టీతోపాటు.. తనవ్యక్తిగత గ్రాఫ్‌ను వివాదాలకు అతీతంగా పెంచుకుంటున్న రాజుకు.. ఇప్పటికీ గ్రాఫ్ పదిలంగానే ఉండడం గమనార్హం.
