Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ కామెడీ కాంబో.. వెంకన్న& భక్తుడు సక్సెస్ కొడతారా?

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు, కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది.

By:  M Prashanth   |   14 July 2026 9:19 AM IST
సూపర్ హిట్ కామెడీ కాంబో.. వెంకన్న& భక్తుడు సక్సెస్ కొడతారా?
X

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు, కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది. ఇద్దరూ లీడ్ రోల్ లో నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తర్వాత తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి మరింత పెంచింది.

ముఖ్యంగా రాజేంద్రప్రసాద్‌ ను వెంకటేశ్వర స్వామి పాత్రలో, శ్రీకాంత్‌ ను ఆయన భక్తుడిగా చూపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఆ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథకు డివోషన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ను యాడ్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కథ విషయానికి వస్తే.. జీవితమంతా డబ్బుల కోసం కష్టపడే ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తికి ఒక్కసారిగా ఊహించని స్థాయిలో మనీ వస్తుంది. ఆ డబ్బు అతని జీవితాన్ని ఎలా మార్చింది? ఆనందం తీసుకొచ్చిందా? లేక కొత్త సమస్యలకు కారణమైందా? అనే అంశాల చుట్టూనే సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రయాణంలో వెంకటేశ్వర స్వామిపై అతనికున్న భక్తి, జీవితంలో ఎదురయ్యే సమస్యలు కథలో మెయిన్ ఎలిమెంట్స్ గా కనిపిస్తున్నాయి.

ట్రైలర్‌ లో నవ్వులు పంచే సీన్స్ తోపాటు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా కనిపించాయి. చివరి వరకు ఏమవుతుందనే ఇంట్రెస్ట్ కలిగించే థ్రిల్లర్ టచ్ కూడా ఉండటంతో సినిమా కేవలం కామెడీకే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ లీడ్ రోల్ లో కనిపిస్తుండటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి విజయాలు అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మరోవైపు రాజేంద్రప్రసాద్ తన ఎక్స్ప్రెషన్స్, టైమింగ్‌ తో వెంకటేశ్వర స్వామి పాత్రకు కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్‌ లో కనిపిస్తోంది ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఇందులో లయ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా, సునీల్, అలీ, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, ధన్‌రాజ్ తదితర కమెడియన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయికార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌ కు మంచి ఊపు తీసుకొచ్చింది.

గతంలో శ్రీకాంత్- రాజేంద్రప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే జోడీ మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమవుతుండటంతో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా 90స్ లోని ఫ్యామిలీ కామెడీ సినిమాలను గుర్తు చేసేలా ట్రైలర్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. మరి మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందా? శ్రీకాంత్- రాజేంద్రప్రసాద్ హిట్ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా? వెంకన్న- భక్తుడి కథ సక్సెస్ అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.