విడాకులు చేసుకున్న కొడుకుకు పాలతో స్నానం చేయించిన తల్లి
సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. కొడుకుకు విడాకులు వచ్చాయని సంతోషించిన తల్లి పాలతో స్నానం చేయించింది.
By: Tupaki Political Desk | 8 Oct 2025 4:01 PM ISTనేటి కాలంలో మూడు ముళ్ల బంధం మూడు రోజుల ముచ్చటగా మారింది. తాతలు, తండ్రుల కాలంలో కాళ్ల పారాణి ఆరకముందే భార్యను అత్తింటి వారు కాటికి పంపితే.. నేటి కాలంలో కాళ్ల పారాణి ఆరక ముందే భర్తను భార్య కాటికి పంపుతోంది. భార్య ప్రియుడు, తల్లిదండ్రులు. ఒక్కో ఘటనలో సొంత పిల్లలను సైతం ఆసరాగా చేసుకుంటూ భర్తను చంపుతున్నారు భార్యలు. నేటి సమాజాన్ని కలవరపెడుతున్న విషయం ఇదే.
ఆసక్తికరమైన వీడియో..
సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. కొడుకుకు విడాకులు వచ్చాయని సంతోషించిన తల్లి పాలతో స్నానం చేయించింది. కొడుకుకు విడాకులు వచ్చాయని అనేకంటే తన కొడుకు భార్య, ఆమె కుటుంబ సభ్యుల చేతిలో చావలేదని సంతోషం వ్యక్తం చేసింది. కొడుకు డైవర్స్ ను వేడుకలాగా నిర్వహించింది. ఈ వీడియో పలువురిని ఆలోచింప చేసింది. కొత్త బట్టలు ధరించిన కొడుకు హ్యాపీ డివోర్స్ అంటూ కేక్ కట్ చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
కొత్త జీవితంలోకి అడుగు..
ఈ సెలబ్రేషన్‌లో అతని తల్లి సంతోషాన్ని మించినదేమీ లేదు. పాలతో స్నానం చేయించడం, జీవితంలోని కొత్త అధ్యాయం కోసం శుభాకాంక్షలు చెప్పడం ఇవన్నీ ప్రత్యేకతను చాటుకున్నాయి. తల్లి తన కొడుకును కొత్త జీవితంలో విజయవంతంగా అడుగుపెడుతున్నట్టు చూపుతూ, భావోద్వేగాలను వ్యక్తం చేసింది. సెలబ్రేషన్ లో మరో విశేషం ఏంటంటే ‘120 గ్రాముల బంగారం, రూ. 18 లక్షలు’ అని రాసి ఉన్న కేక్ ను కటింగ్ చేశాడు. ఈ ఘట్టం వీడియోకు మరింత ఆకర్షణీయంగా మార్చింది.
భిన్న స్పందనలు..
ఈ వీడియోపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మున్ముందు భవిష్యత్ బాగుండాలంటూ’ కొందరు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది నిజంగా సరదాగా ఉంది’ అంటూ మరి కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఈ వీడియో పాజిటివ్ చర్చగా మార్చి, కొత్త జీవితం మొదలు పెట్టాలని ఆయనకు ఆశీస్సులు అందిస్తుంది.
లైఫ్ డిషిజన్స్ లో ఎలా స్పందించాలంటే..?
ఈ వీడియో ముఖ్యమైన సందేశాన్ని అందించింది. వ్యక్తిగత నిర్ణయాలను బాధతో కాకుండా ఆనందంగా స్వీకరించడం, కుటుంబ సపోర్ట్ కొత్త జీవితం ప్రారంభం ఎంతగానో ప్రేరణ కలిగిస్తుంది. కొడుకు విడాకులు సాధించడమే కాదు.. దానిని వేడుకగా ఘనంగా నిర్వహించడం తన వెంట కుటుంబం ఉందన్న భరోసా కల్పించినట్లుంది. ఈ ఘటన వ్యక్తిగత జీవితాల్లో ఆనందం, కుటుంబ మద్దతు పెరుగుతున్న భార్య బాధితుల గురించి తెలియజేస్తుంది.
