Begin typing your search above and press return to search.

బాబుకు మోడీ ఫోన్...లోకేష్ కి కీలక బాధ్యతలు

ఏపీలో తుఫాన్ ని ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ కీలక సమయంలో నేరుగా బాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు.

By:  Satya P   |   27 Oct 2025 11:31 PM IST
బాబుకు మోడీ ఫోన్...లోకేష్ కి కీలక బాధ్యతలు
X

ఒక వైపు మొంథా తుఫాన్ ఏపీని కమ్ముకుని ఉంది, ఏపీ అంతటా అతి భారీ వర్షాలే కురుస్తున్నాయి. ప్రకృతి భయపెడుతోంది. మోంథా అత్యంత భీకరంగా మారుతోంది. ఏపీ వైపు దూకుడుగా దూసుకుని వస్తోంది. అదే సమయంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షను నిర్వహిస్తున్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాస్తవ సమయంలోనే పూర్తి సమాచారాన్ని జనాలకు అందించాలని అప్టూ డేట్ గా తుఫాన్ సమాచారం అందించాలని బాబు అధికారులను ఆదేశించారు. అంతే కాదు ఒక్క ప్రాణ నష్టం కూడా ఉండరాదని జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బాబు సూచించారు.

మోడీ ఫోన్ :

ఏపీలో తుఫాన్ ని ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ కీలక సమయంలో నేరుగా బాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఏపీలో మోంథా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది. ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని ఆయన స్వయంగా వాకబు చేశారు. బాబు తాము తీసుకుంటున్న చర్యల గురించి మోడీకి వివరించారు. మోడీ తాను అండగా ఉంటానని బాబుకు హామీ ఇచ్చారు. అంతే కాదు కేంద్రం ఏ విషయంలో అయినా తగిన విధంగా స్పందించి సహాయ సహకారాలను అందిస్తుందని కూడా గట్టి భరోసా ఇచ్చారు.

లోకేష్ కి బాధ్యతలు :

మోడీ బాబుతో నేరుగా మాట్లాడిన వెంటనే ఆయన మంత్రి నారా లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగించారు. కేంద్రంతో ప్రధానమంత్రి ఆఫీసు తో టచ్ లో ఉండమని కోరారు. ఎప్పటికపుడు ఏపీకి చెందిన సమాచారాన్ని కేంద్రంతో పంచుకుంటూ తుఫాన్ ప్రభావం గురించి వెల్లడిస్తూ కేంద్రం ఇచ్చే ఇన్ పుట్స్ తీసుకుంటూ ఏపీకి కేంద్రం నుంచి ఇచ్చిన భరోసా ఆధారంగా ఏమి చేయాలో లోకేష్ అది చేస్తారు అన్న మాట. ఇది నిజంగా బృహత్తర బాధ్యత. లోకేష్ దానిని సమర్ధంగా నిర్వహించగలరని భావించే చంద్రబాబు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

మోడీ డైరెక్ట్ గానే :

మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సాయం కోరుతాయి. తమ బాధలు విన్నవించుకుంటాయి. ఇదంతా తుఫాన్ అనంతరం జరిగే ప్రక్రియ. కానీ మోడీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరా తీయడమే కాదు తాము అండగా ఉంటామని చెప్పడం గొప్ప విషయం అని అంటున్నారు. ఈ విధంగా కేంద్రం ఏపీ విషయంలో తగిన చొరవ తీసుకోవడం వెనక బాబు ఉన్నారని అంటున్నారు. ఏపీ కేంద్రానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంది. దాంతో కేంద్రం కూడా ఈ ఆపత్కాల సమయంలో ఏపీకి గట్టి అండగా ఉంటూ తగిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా ఒక ప్రధాని రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులు తెలుసుకుని తానుగా స్పందించడం అన్నది గ్రేట్ అనే అంటున్నారు.