Begin typing your search above and press return to search.

సూపర్ సైక్లోన్ హైలీ ఎఫెక్ట్...నలభై లక్షలు...ఐదు జిల్లాలు

ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావం గురించి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   28 Oct 2025 6:59 PM IST
సూపర్ సైక్లోన్  హైలీ ఎఫెక్ట్...నలభై లక్షలు...ఐదు జిల్లాలు
X

మొంథా సూపర్ సైక్లోన్ ఏపీ మీద పడగ విప్పింది. ఈ సూపర్ సైక్లోన్ ని ఎదుర్కోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలను తీసుకుంటోంది. ఒక్క ప్రాణం కూడా ఈ పెను తుఫాన్ బారిన పడకూడదు అన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది మామూలు తుఫాన్ కాదు, అతి పెద్ద తుఫాను గానే చరిత్ర పుటలలోకి ఎక్కేదిగా ఉంది. అందుకే దీని మీద గత వారం రోజులుగా కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. మొత్తం కేబినెట్ తో పాటు దిగువ స్థాయిలో చివరి సిబ్బంది వరకూ అంతా పూర్తి అలెర్ట్ తో పనిచేస్తున్నారు.

నలభై లక్షల మంది :

మొంథా సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ ఎంత అంటే నలభై లక్షల మంది ప్రత్యక్షంగా ఈ తుఫాన్ కి గురి అవుతున్నారు అన్నది ప్రభుత్వం అందించిన సమాచారంగా ఉంది. అంతే కాదు హైలీ ఎఫెక్ట్ జిల్లాలుగా అయిదు ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. ఆ జిల్లాలు చూస్తే కనుక కాకినాడ, కోనసీమ, బాపట్ల, గుంటూరు, ఎంటీఆర్ ఉన్నాయి. అని చెబుతున్నారు. నలభై లక్షల మంది తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రత్యక్షంగా ఈ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ పడుతోంది. దాంతో వారిని పునరావాసానికి తరలించారు.

మరో 18 గంటల దాకా :

ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావం గురించి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మొంథా తుఫాన్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారని లోకేష్ చెప్పారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. తీరం దాటడం అన్నది కీలకమని ఆ తరువాత కూడా మరో 18 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.

తుఫాన్ అనంతరం :

తుఫాన్ అనంతరం పరిస్థితులను కూడా మధింపు చేస్తున్నామని లోకేష్ చెప్పారు. మొంథా తుపాన్ తీరం దాటాక చేయాల్సిన పనులపై సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతే కాకుండా ఈ రాత్రి అంతా ఆర్టీజీఎస్‌లో తాను ఉండిమొత్తం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పన్ట నష్టం, ఇళ్లు, సహాయ చర్యలు తీసుకున్నామని చెప్పారు అదే విధంగా సముద్ర తీరాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఈ సమయంలో ప్రమాదం ఉంటుందని ఎవరూ బీచ్ ల వద్దకు వెళ్ళరాదని ఆయన కోరారు. అతే కాదు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని లోకేష్ చెప్పారు.