Begin typing your search above and press return to search.

కోతుల బాధలతో ఇండియా...చైనా షేకింగ్

కోతులను తెచ్చి అనేక నూతనమైన మందుల తయారీలో క్లినికల్ ట్రయల్స్ పేరుతో వాటి మీదనే ప్రయోగాలు చేస్తారు. అల వేయడం కోసం కోతులను కొంటారు. దాంతో వాటి ధర విపరీతమై కూర్చుందిట.

By:  Satya P   |   11 Jan 2026 8:00 AM IST
కోతుల బాధలతో ఇండియా...చైనా షేకింగ్
X

కోతులు మానవుడికి పూర్వాశ్రమం. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని అంటారు. ఇక కోతులు మనుషులూ కలిసే జీవిస్తున్నాయి. మనిషి గురించి తెలుసుకోవాలంటే ముందు కోతినే పరిశోధిస్తారు. ఇలా కోతులతో జన్యువుల బంధం మనిషిది. ఇదిలా ఉంటే భారత దేశంలో కోతులకు కొదవ లేదు, పైగా వాటి నుంచి అతి పెద్ద బెడద ఉంది. ఎందుకంటే అవి ఇళ్ళలో చొరబడి చేయాల్సిన చేష్టలు చేస్తూ నష్ట పరుస్తున్నాయి. అలాగే తోటలు పొలాలలో చేరి తీవ్రంగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ విధంగా కోతులతో భారత దేశంలోని అంతటా అవస్థలు పడుతూంటే ఒక దేశంలో మాత్రం కోతుల కొరత తీవ్రతతో అలమటిస్తోంది ఆ దేశమే చైనా. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే అదే ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవాల్సి ఉంది.

కోతులు అవసరం ఎంతో :

చైనా అంటేనే బయో టెక్నాలజీ రంగంలో ముందుకు సాగుతుందని చెబుతారు. బయో వార్ కోసం ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉంటాయని ప్రచారం కూడా ఉంది. వాటి సంగతి పక్కన పెడితే చైనా ల్యాబ్ లలో ప్రయోగాలు చేసేందుకు కోతులనే ఉపయోగిస్తారు. అలా వాడేందుకు కోతులు తక్కువ అయిపోయి అమాంతం వాటి డిమాండ్ ఇపుడు పెరుగుతోందిట. నిజానికి చూస్తే గతానికి ఇప్పటికీ కోతుల ధర్ల చూస్తే చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆ మధ్య దాకా ఒక్కో కోతికి ధర చూస్తే చైనా కరెన్సీ యువాన్లు కింద 1.5 లక్షలుగా చెబుతున్నారు. అదే మన భారతీయ కరెన్సీలో పద్దెనిమిది లక్షల రూపాయలు అన్న మట. కానీ అదేంటో ఇపుడు చూస్తే ఆ ధర కాస్తా ఏకంగా పాతిక లక్షలకు చేరుకుంది అని అంటున్నారు.

మందుల పరిశోధనలకు :

కోతులను తెచ్చి అనేక నూతనమైన మందుల తయారీలో క్లినికల్ ట్రయల్స్ పేరుతో వాటి మీదనే ప్రయోగాలు చేస్తారు. అల వేయడం కోసం కోతులను కొంటారు. దాంతో వాటి ధర విపరీతమై కూర్చుందిట. ఇలా కోతుల సంఖ్య తగ్గడం వాటి ధరలు ఒక్కసారిగా పెరగడంతో అక్కడ బయో టెక్నాలజీ రంగానికి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎక్కువ ధరలకు కోతులను కొంటే మందుల తయారీ ఖర్చు కూడా పెద్ద ఎత్తున పెరుగుతోందని అంతే కాదు వాటికి కొరత ఉండడంతో ఈ ప్రయోగాలకు సైతం సమయం కూడా అధికం అవుతోంది అని అంటున్నారు.

గిరాకీ ఉన్నా సంఖ్య అంతే :

కోతుల సంఖ్య అయితే అక్కడ అనుకున్నంతగా పెరగడం లేదు. అదే సమయం క్లినికల్ టెస్టులకు అవి కావాల్సి రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతోంది. దాంతో డిమాండ్ అండ్ సప్లై మధ్య భారీ అంతరంతో కోతులకు యమ గిరాకీ ఏర్పడింది అని అంటున్నారు. ఇక ప్రస్తుతం చూస్తే చైనాలోని బయోటెక్ రంగానికి చెందిన అనేక సంస్థలు ఇంటర్నేషల్ మార్కెట్ లోని ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అలా భారీ ఎత్తున ఈ ఒప్పందాలు జరిగాయి అని చెబుతున్నారు. దాంతో ఈ కొత్త మందుల తయారీ విషయంలో పరిశోధన అధికంగా ఇపుడు జరుగుతున్నాయి. అలా క్లినికల్ టెస్టులకు కోతులు కావాలీ అంటే అవి దొరకడం లేదు అని అంటున్నారు. మరో వైపు కోతులను తమ దగ్గరే సాకి పెంచి పెద్ద చేయడానికి ఏకంగా నాలుగైదేళ్లు పడుతుదని అంటున్నారు. అందుకే పెరిగిన కోతులను తీసుకోవాలంటే లక్షలు పోసినా దొరకడం లేదుట. కోతుల ఉత్పత్తిదారులకు నిజంగా ఈ బయోటెక్ కంపెనీలు ఒక వ్యాపార కేంద్రాలుగా ఉంటాయి. కానీ వారు కూడా అనూహ్యంగా పెరిగిన డిమాండ్ కి తగినట్లుగా కోతులను ఉత్పత్తి చేయించి అందించలేకపోతున్నారు.

బయట కోతులతో కుదరదు :

బయట ఎక్కడో అడవులలో పెరిగే కోతులు క్లినికల్ టెస్టులకు అంతగా పనికి రావు అని అంటున్నారు. వైద్య పరిశోధనలు చేయాలీ అంటే వాటికి ప్రత్యేకంగా తయారు చేసిన బ్రీడింగ్ కేంద్రాలలో పెంచుతారు. అందుకే బయట కోతులు ఉన్నా వాటిని తీసుకోరని చెబుతున్నారు. ఈ క్రమంలో కోతులను పెంచే వారి దగ్గర తీసుకుని బ్రీడింగ్ కేంద్రాలలో తగిన ఎత్తు బరువు, ఏజ్ అన్నీ చూసుకుని పరిశోధనలకు వాడుతారని అంటున్నారు. దాని వల్లనే మంచి రిజల్ట్స్ వస్తాయని చెబుతున్నారు. సో కోతుల కొరత అయితే చైనా ల్యాబ్స్ ని పట్టి పీడిస్తోంది. అదే సమయంలో మనకు కోతుల బెడద అధికంగా ఉంది. చూస్తే విడ్డూరంగా ఉన్నా ఈ కోతులతో రెండు దేశాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయనే అంతా అంటున్నారు.