Begin typing your search above and press return to search.

మోడీ ప్రధాని అయ్యారంటే....మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆయన దేశంలో పలు చోట్ల నిర్వహిస్తూ వివిధ వర్గాలకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియచేస్తున్నారు.

By:  Satya P   |   9 Feb 2026 6:51 PM IST
మోడీ ప్రధాని అయ్యారంటే....మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
X

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆయన దేశంలో పలు చోట్ల నిర్వహిస్తూ వివిధ వర్గాలకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియచేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పదవుల కోసం క్రెడిట్ కోసం ఆరాట పడే సంస్థ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అందరిదీ అని దేశం ఐక్యంగా ఉండాలని మాత్రమే ఆర్ఎస్ఎస్ ఎపుడూ కోరుకుంటుంది అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ రెక్కల కష్టం :

ఈ రోజున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నా ఆర్ఎస్ఎస్ రెక్కల కష్టం అని అంతా నమ్ముతారు అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో బీజేపీ అప్రతిహత విజయాలకు ఆర్‌‌ఎస్ఎస్ విధానాలే కారణమని ఆయ్హన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వల్లనే దేశానికి అచ్ఛే దిన్ వచ్చాయని కూడా ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల అచ్ఛే దిన్ వచ్చాయని అనుకున్న వారికి మోహన్ భగవత్ ఈ విధంగా జవాబు చెప్పారు. వాస్తవానికి చూస్తే కనుక బీజేపీ అధికారంలోకి రావడానికి కానీ ఆ పార్టీకి మంచి రోజులు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ అతి ముఖ్య కారణం అని మోహన్ భగవత్ ఫుల్ క్లారిటీతో చెప్పారు.

రామాలయం నిర్మాణంపైన :

అంతే కాదు దేశంలో రామాలయం నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. దీంతోపాటు స్వయంసేవకుల కఠోర శ్రమ కూడా ఆలయ నిర్మాణం వెనక ఉందని భగవత్ స్పష్టం చేశారు. ఇవి పూర్తి నిబద్ధతతో సాగినవి అని గుర్తు చేశారు. అలా ఆర్ఎస్ఎస్ పట్టుదలగా చేసిన ఉద్యమాల వల్లనే రామాలయం నిర్మాణం కల సాకారం అయింది అని ఆయన వెల్లడించారు. అదే సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన పార్టీలు రాజకీయంగా లాభపడ్డాయని కూడా మోహన్ భగవత్ చెప్పడం విశేషం.

దేశం కోసమే :

మరో వైపు చూస్తే మోహన్ భగవత్ దేశానికి ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ ఎపుడూ దేశం కోసం పాటు పడే సంస్థ అని అన్నారు. అంతకంటే ఆర్ఎస్ఎస్ ఏదీ కోరుకోదని ఆయన అంటున్నారు. బీజేపీ ఒక రాజకీయ సంస్థ అని సొంత విధానాలతో పనిచేస్తుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వ్యవహారాలు కార్యక్రమాలు వేరు అన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. మొత్తానికి చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ బీజేపీ నేతల మీద ఆ పార్టీ మీద పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీ అధికార్మ వెనక కానీ మోడీ ప్రధాని కావడం వెనక కానీ ఆర్ఎస్ఎస్ ఉందన్న సంగతిని ఆయన గట్టిగా చాటి చెబుతున్నారు.

గ్యాప్ ఏమైనా ఉందా :

ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీ పెద్దలకు ఆర్ఎస్ఎస్ కి మధ్య గ్యాప్ ఏమైనా ఉందా అన్న చర్చ అయితే వస్తోంది. పదే పదే తమకు అధికారం గుర్తింపు అవసరం లేదంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచింపచేసేలా ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు బీజేపీ పవర్ తమ చలవే అని కూడా భగవత్ చెప్పడం కూడా చర్చకు కారణం అవుతోంది.

ఇద్దరూ కీలకంగా :

ఇంకో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ కి చీఫ్ గా మోహన్ భగవత్ 2009 మార్చి 21న ఆర్ఎస్ఎస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ చరిత్రలో సుదీర్ఘ కాలం అధినేతగా ఉన్న వారుగా గుర్తింపు పొందారు. ఇక 2014లో మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ల మధ్య సాన్నిహిత్యం గడచిన పన్నెండేళ్లలో తగ్గిపోయింది అన్న ప్రచారం అయితే సాగుతోంది. గతంలో హెచ్ వి శేషాద్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని చెప్పుకునే వారు. అయితే మోడీ భగవత్ ల మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీ అధ్యక్ష పదవుల విషయంలో ఆర్ఎస్ఎస్ సలహా సూచనలను గతంలో తీసుకునే వారు అని చెబుతారు. కానీ మోడీ ప్రధాని అయ్యాక పార్టీ వ్యవహారాలను సైతం ఆయన మరో వైపు సీరియస్ గానే చూస్తూ వస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కేవలం ప్రచారాలుగానే ఉన్నా తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఏమైనా గ్యాప్ ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.