Begin typing your search above and press return to search.

10 కోట్ల కుంభకోణం.. భారతీయుడికి రెండేళ్లు జైలు శిక్ష!

ఈ మధ్యకాలంలో కొంతమంది భారీ స్కాంకి పాల్పడుతూ పేదలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   3 Dec 2025 8:00 PM IST
10 కోట్ల కుంభకోణం.. భారతీయుడికి రెండేళ్లు జైలు శిక్ష!
X

ఈ మధ్యకాలంలో కొంతమంది భారీ స్కాంకి పాల్పడుతూ పేదలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయాల్సింది పోయి పేదలను దోచుకుంటూ.. ఆర్థికంగా లాభపడుతున్నారు. ఇక పట్టుబడ్డారో జైలుశిక్ష తప్పదు. సరిగా ఇప్పుడు భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి అలాగే జరిగింది. 10 కోట్ల భారీ స్కామ్ కి పాల్పడిన ఆ వ్యక్తిని అధికారులు గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు శిక్ష పూర్తి అయిన తర్వాత దేశం నుండి బహిష్కరణ చేసే ప్రయత్నాలు కూడా లేకపోలేదని సమాచారం.

విషయంలోకి వెళ్తే..అమెరికాలో భారత సంతతికి చెందిన 35 సంవత్సరాల మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం ఇప్పుడు వైరల్గా మారింది. ముఖ్యంగా ఈయన 10 కోట్లకు పైగా హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడినట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు. విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఏప్రిల్ లో చికాగో ఓ హేర్ పోర్టులో విమానం ఎక్కుతుండగా.. అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వాషింగ్టన్ లోని ఒక డయాగ్నస్టిక్ టెస్టింగ్ ల్యాబరేటరీ ద్వారా మెడికేర్ నిధులు ముఖ్యమైన వైద్య సంరక్షణ కోసం వినియోగించాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వం తో పాటు పన్ను చెల్లించే వారికి ఎక్కువ నష్టం కలిగించిన నేపథ్యంలో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.

వృద్ధులు, పేదలకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికేర్ వ్యవస్థను ఇతడు పక్కదారి పట్టించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫ్ కొంతమంది వ్యక్తులతో కలసి కోవిడ్ నిర్ధారణతో సహా ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలకు సంబంధించి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే నకిలీ బిల్లులు పెట్టి మోసం చేసినట్లు లాయర్లు వెల్లడించారు.

ఈ మేరకు యూఎస్ అటార్నీ చార్లెస్ నైల్ ఫ్లోయిడ్ మాట్లాడుతూ.." మెడికేర్ నిధులు ముఖ్యమైన వైద్య సంరక్షణ కోసం వినియోగించాల్సి ఉండగా.. వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంతో పాటు పన్ను చెల్లించే వారికి కూడా నష్టం కలుగుతుంది." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు తెలిపిన వివరాల ప్రకారం 2021లో మెడికేర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయగా.. దీని మెడికల్ లైసెన్స్ 2023లో పూర్తయింది. కానీ దీనిపై పలు ఫిర్యాదులు తలెత్తడంతో 2025లో ఈ ల్యాబ్ ను మూసేశారు. ఈ ల్యాబ్ కి మెడికేర్ డైరెక్టర్గా ఆసిఫ్ వ్యవహరిస్తున్నారు. చాలామంది తాము ఎన్నడు చేయించుకోని పరీక్షలకు కూడా చార్జీలు విధించినట్లు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద కూడా పరీక్షలు నిర్వహించినట్లు బిల్లులు రూపొందించినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయి.

ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలను ఆసిఫ్ నిర్వహించేవాడని తెలుస్తోంది..కాబట్టి ఇతడు కూడా నేరం అంగీకరించిన నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు.