మోడీ వర్సెస్ రాహుల్: ప్రత్యక్ష పోరులో గెలుపెవరిది?!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి మధ్య ప్రత్యక్ష ఎన్నికల సమరా నికి బీహార్ వేదిక అయింది.
By: Garuda Media | 7 Oct 2025 11:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి మధ్య ప్రత్యక్ష ఎన్నికల సమరా నికి బీహార్ వేదిక అయింది. ఎన్నికల సమయానికి మూడు మాసాల ముందే.. ఇద్దరూ బీహార్ వేదికగా.. అనేక సవాళ్లు-ప్రతి సవాళ్లు రువ్వుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. `ఓట్ చోరీ`-అంటూ.. రాహుల్‌గాంధీ బీజేపీని, అదేవిధంగా ప్రధాన మంత్రిని కూడా టార్గెట్ చేశారు. అంతేకాదు.. కీలకమైన `ఓట్ అధికార యాత్ర` పేరుతో 22 జిల్లాల్లో 30 రోజులపాటు ఆయన యాత్ర చేశా రు. ప్రతి సభలోనూ మోడీ కేంద్రంగా ఆయన నిప్పులు చెరిగారు. దీంతో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో రాహుల్ సత్తా ఏమేరకు ఉంటుందన్నది చూడాలి.
ఇక, మోడీ విషయానికి వస్తే.. బలమైన యాదవ సామాజిక వర్గంతోపాటు.. `నాయి` సామాజిక వర్గాన్ని కూడా ఆయన ప్రభావితం చేస్తున్నారు. `నాయి` సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రచయిత, సామాజిక వేత్త.. `కర్పూరీ ఠాకూర్`కు ముందస్తుగానే(గత ఏడాది) అత్యంత కీలకమైన పౌర సన్మానం.. `భారత రత్న`ను ప్రకటించారు. తద్వారా.. మోడీ ఆ సామాజిక వర్గానికి ఆరాధ్య నాయకుడిగా మారిపోయారు. పైగా `ఈబీసీ` కేటగిరీలో `నాయి`ని చేర్చడం కూడా.. ఆయనకు ఎంతో కలిసి వస్తోంది. ఇక, రాజకీయంగా చూసుకుంటే.. రాహుల్ గాంధీ పేరు ఎత్తుకుండానే.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటు న్నారు. గాంధీల కుటుంబం.. ముఖ్యంగా నెహ్రూను కూడా ఎండగడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ వ్యవహారం.. అటు మోడీకి, ఇటు రాహుల్‌కు కూడా తీవ్ర పరీక్షగానే మారిందని చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పామని.. ఉగ్రమూకను అరికట్టామని ప్రధాని చెబుతున్నారు. కానీ, రాహుల్ మాత్రం.. దీనిని ఎందుకు అర్ధంతరంగా ఆపేశారో చెప్పాలని.. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం.. ఆయన పదే పదే దీనిపై కామెంట్లు చేయడాన్ని కూడా.. రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను ప్రధాని ఇప్పుడు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు. అంతేకాదు.. బీహార్‌లోని అత్యంత వెనుక బడిన జిల్లాగా పేరున్న దర్భంగా కు ఇటీవలే 7 వేల కోట్ల రూపాయల ప్యాకేజీతో అనేక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు.
ఎవరు ఎటు?
ఇక, బలాబలాను బట్టి చూస్తే.. మోడీకి ఉన్న ఆదరణ.. రాహుల్‌కు లేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. అనేక సర్వేలు ఇప్పటికే వచ్చాయి. వాటిలో ప్రధానంగా మోడీ హవాను గ్రామీణ స్థాయిలో ఎక్కువ మంది కోరుకుంటున్న సూర్య ఘర్ నుంచి పీఎం కిసాన్ వరకు.. అదేవిధంగా స్వయం ఉపాధి రుణాలు... బీహార్‌ను సైతం `పూర్వోదయ` పథకంలో చేర్చినిధులు ఇవ్వడం.. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం వంటివి మోడీకి కలిసి వస్తున్నాయి. అంతేకాదు.. బీజేపీకి ఉన్న ఏకైక ఐకానిక్ నాయకుడు, మేజర్ ఎన్నికల ప్రచాకర్త కూడా.. మోడీనే. ఆయన మాటలే మంత్రంగా.. బీహార్ ఓటు బ్యాంకును సమూలంగా తమవైపు తిప్పుతారన్న వాదనను కూడా బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ తరహా బలమైన వాదన కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. సో.. మొత్తంగా ఎవరు గెలుస్తారన్నది.. ఈ 40 రోజుల పరిస్థితులను బట్టి తేలనుంది.
