Begin typing your search above and press return to search.

యూఏఈ అధ్యక్షుడితో మోడీ చిన్న మీటింగ్.. పాక్ కు పెద్ద షాక్!

అవును... సోమవారం భారతదేశంలో రెండు గంటల పాటు జరిగిన స్వల్పకాలిక.. కానీ, ముఖ్యమైన పర్యటనలో యుఎఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత చర్చలు జరిపారు.

By:  Raja Ch   |   21 Jan 2026 9:49 AM IST
యూఏఈ అధ్యక్షుడితో మోడీ  చిన్న మీటింగ్.. పాక్  కు పెద్ద షాక్!
X

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. భారతదేశానికి అధికారిక పర్యటన చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లలో హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశానికి రావడం ఇది ఐదో సారి కాగా.. యుఎఈ అధ్యక్షుడి హోదాలో మాత్రం ఆయనకు ఇది మూడో అధికారిక భారత్ పర్యటన. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్యా ఏమి చర్చ జరిగింది.. పాక్ ప్రస్థావన ఎలా కీలకంగా మారిందనేది ఆసక్తిగా మారింది.

అవును... సోమవారం భారతదేశంలో రెండు గంటల పాటు జరిగిన స్వల్పకాలిక.. కానీ, ముఖ్యమైన పర్యటనలో యుఎఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానంగా... అణు రియాక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, ఇంధన భద్రత, ఉగ్రవాద నిరోధకంపై సహకారం కీలక దృష్టి కేంద్రాలుగా ఉద్భవించాయని అంటున్నారు. ఈ సమయంలో సౌదీ అరేబియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న పాక్ కు చెక్ పెట్టే విషయంలో ఇద్దరూ ఒక మాటపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పక్కపక్కనే ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ లకు యెమన్ విషయంలో అభిప్రాయభేదాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని అంటున్నారు. దీంతో.. పలు విషయాల్లో వీరి మధ్య సహకారం కొరవడిందనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఇదే క్రమంలో.. ఈ ఇద్దరికీ దగ్గరగా ఉండే అమెరికా.. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని.. ఇరు దేశాలకూ స్పష్టత ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్ తో ఫ్రెండ్ షిప్ పెంచుకుంటుంది సౌదీ అరేబియా. అందుకు ఒక కారణం.. అణ్వాయుదాలు కలిగి ఉన్న ఏకైన ముస్లిం దేశం పాక్ కావడం కావొచ్చు!

వాస్తవానికి ఇటీవల రహస్యంగా ఇరాన్ కూడా అణ్వాయుదాల తయారీకి విశ్వప్రయత్నాలు చేసినా... అది గ్రహించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఈ సమయంలో ఫైనల్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చి ఆ ప్రయత్నాలను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో.. అమెరికా, ఇజ్రాయెల్ పై ఇరాన్ రగిలిపోతుంది. ఈ సమయంలో.. తమ దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల పేరు చెప్పి అమెరికా దాడులకు దిగితే.. సౌదీ, యూఏఈలో అమెరికా స్థావరాలను ఓ దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే ఆర్థికంగా అమెరికాకు పెద్ద దెబ్బే తగిలినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో... రిస్క్ కంట్రీస్ తో స్నేహం కంటే శాంతియుత దేశంతోనే అన్ని విధాలా ప్రయాణం మంచిదని గ్రహించిన యూఏఈ ప్రెసిడెంట్.. భారత్ తో సంబంధాలను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు యూఏఈ రూపంలో మోడీ చెక్ పెట్టారని చెబుతున్నారు. ఇది సౌదీ - యూఏఈ – పాక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు.

ఇదే సమయంలో... సరిహద్దు ఉగ్రవాదం సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఇరుపక్షాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఇదే సమయంలో ఉగ్రవాద నేరస్థులు, వారికి ఆర్థిక సహాయం అందించేవారు, అన్ని విధాలా మద్దతు అందించేవారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఈ సందర్భంగా భారత్, యూఏఈ అంగీకరించాయి. ఉగ్రవాదానికి నిధులు, మనీ లాండరింగ్‌ ను ఎదుర్కోవడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టీ.ఎఫ్.) చట్రంలో సహకారాన్ని కొనసాగించడానికి ఈ సందర్భంగా ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇది పాక్ కు కచ్చింతంగా బిగ్ షాక్ అనే చెప్పాలి!