ట్రంప్ ఫోన్ చేస్తే తీయని మోడీ.. అంత ధైర్యమా?
ఒకళ్లు మొండి అయితే.. మరొకరు మొండికే మొండి. అలాంటి ఇద్దరు అధినేతల మధ్య పంచాయితీ మొదలైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇట్టే అర్థమయ్యే ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది.
By: Garuda Media | 28 Aug 2025 11:42 AM ISTఒకళ్లు మొండి అయితే.. మరొకరు మొండికే మొండి. అలాంటి ఇద్దరు అధినేతల మధ్య పంచాయితీ మొదలైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇట్టే అర్థమయ్యే ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. స్నేహంగా ఉన్నంత వరకు ఓకే కానీ.. లెక్కల్లో తేడా రావటాన్ని.. తనను తక్కువ చేయటాన్ని అస్సలు ఇష్టపడరు భారత ప్రధానమంత్రి మోడీ. రోజుకో మాట చెప్పటం.. అవసరమైతే తగ్గటం.. అంతలోనే చెలరేగిపోవటం లాంటి చేష్టలు ట్రంప్ కు అలవాటే. కానీ, మోడీ మాత్రం అలా కాదు. తొందరపడి ఒక నిర్ణయానికి రావటం ఉండదు. కానీ.. ఒకసారి డిసైడ్ అయితే మాత్రం ఎవరు చెప్పినా వినని తత్త్వం మోడీదని చెబుతారు.
దేశ రాజకీయాల్లో మోడీతో పంచాయితీ పెట్టుకున్న అధినేతలు.. ఆ తర్వాతి కాలంలో కలిసి పోవటం కనిపిస్తుంది. అంతేకాదు.. తనకు నచ్చని ముఖ్యమంత్రి విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో కోపం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో పాటు రష్యా నుంచి కొనుగోలు చేస్తునన ముడి చమురు అంశంలో భారత్ ప్రయోజనాల్ని దెబ్బ తినేలా.. ఇబ్బందికి గురయ్యేలా ఉండటం మోడీకి కోపం తెప్పించింది.
తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ట్రంప్ చేసిన ప్రకటనలు.. పాత స్నేహాన్ని పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్ననిర్ణయాలు మోడీకి కోపం వచ్చేలా చేశాయని చెబుతున్నారు.దీనికి తగ్గట్లే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ - పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒకటి నాలుగుసార్లు చేసినా.. మోడీ నుంచి స్పందన రాలేదు. అయితే.. ఆ అంశాన్ని పట్టుకొని అదే పనిగా కెలికే ట్రంప్ నకు.. కాస్త ఆగి కౌంటర్ ఇవ్వటం షురూ చేశారు మోడీ.
దీనికి ముందు పక్కాగా గ్రౌండ్ రెఢీ చేసుకున్న మోడీ.. ఆన రియాక్షన్ ఇవ్వటం షురూ చేశారు. తాము చెప్పినట్లుగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా భారత్ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ కోరికను మోడీ లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ముడి చమురు విషయంలో ఎవరి మాటా వినే పరిస్థితుల్లో భారత్ లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారని చెప్పాలి. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి నాలుగు సార్లు ఫోన్ చేసినా.. ఆన్సర్ ఇవ్వని వైనం తాజాగా వెలుగు చూసింది.
ఈ విషయాన్ని జర్మన్ వార్తా పత్రిక ఫ్రాంక్ ఫర్టర్ ఆల్గెమైన్ జైటంగ్ రిపోర్టు చేసింది. ఈ సందర్భంగా మోడీ కోపం తీవ్రతను.. ట్రంప్ నిర్ణయాలకు అస్సలు పట్టించుకోన్న రీతిలో మోడీ తీరు ఉందని చెబుతున్నారు. గతానికి భిన్నంగా అమెరికా ఒత్తిడికి భారత్ లొగే ప్రసక్తి లేదన్న అంశాన్ని తన చేతలతో మోడీ చెప్పకనే చెప్పేస్తున్నట్లుగా చెప్పాలి. తన చర్యలతో అమెరికా అధ్యక్షుడు తనను ఎంత చికాకు పెట్టించారన్న విషయాన్ని మోడీ చేతలతో చెప్పేస్తున్నట్లుగా చెప్పాలి. మోడీ ఇస్తున్న షాకింగ్ సర్ ప్రైజులకు ట్రంప్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
