జీ7లో మోదీ-ట్రంప్ భేటీ.. ప్రపంచానికి మోక్షమా.. లేక మరో మైండ్ బ్లోయింగ్ సెల్ఫీయా?
కానీ నెటిజన్ల ఫోకస్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. "బాస్.. అక్కడ సీరియస్ చర్చలు ఎంతసేపు జరుగుతాయో పక్కన పెట్టండి.. ఇద్దరి మధ్య పొగడ్తల వర్షం ఎంతసేపు కురుస్తుంది?"
By: A.N.Kumar | 14 Jun 2026 1:36 AM ISTప్రపంచ రాజకీయాల స్క్రీన్‌ప్లే ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం ఏ జ్యోతిష్యుడి వల్లా కాదు. కానీ ఒక సీన్ మాత్రం పక్కా హిట్. అదే మన ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం.. కెమెరాల ఫ్లాష్ లైట్లకు పండగ, సోషల్ మీడియా మీమర్లకు ప్యాకేజీ ఇచ్చే ఈ కాంబినేషన్ ఇప్పుడు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ7 సదస్సులో మరోసారి రిపీట్ కానుంది. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్లు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారని వైట్‌హౌస్ ఆల్రెడీ డప్పు కొట్టి మరీ ప్రకటించింది.
సమస్యల సుడిగుండంలో ప్రపంచం.. సొల్యూషన్ దొరికేనా?
ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. పశ్చిమాసియాలో బాంబుల శబ్దాలు మోగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్పేస్ ఎక్స్ రాకెట్లా పైపైకి దూసుకెళ్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ "నన్ను కాపాడే నాథుడే లేడా?" అని దిక్కులు చూస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఈ ఇద్దరు ‘పవర్‌ఫుల్’ నేతలు కలవడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. భారత్-అమెరికా రక్షణ ఒప్పందాలు, చైనాకు ఎలా చెక్ పెట్టాలి.. చమురు సరఫరాను ఎలా లైన్లో పెట్టాలి అనే విషయాలపై సీరియస్ చర్చలు జరుగుతాయని విశ్లేషకులు కోటు సూట్లు వేసుకుని మరీ టీవీల్లో విశ్లేషిస్తున్నారు.
కానీ నెటిజన్ల ఫోకస్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. "బాస్.. అక్కడ సీరియస్ చర్చలు ఎంతసేపు జరుగుతాయో పక్కన పెట్టండి.. ఇద్దరి మధ్య పొగడ్తల వర్షం ఎంతసేపు కురుస్తుంది?" అనేది వారి మెయిన్ డౌట్. ట్రంప్ గారు మోదీని "మై గ్రేట్ ఫ్రెండ్" అంటారా? లేక మోదీ గారు ట్రంప్‌ను "వరల్డ్ క్లాస్ లీడర్" అని కౌగిలించుకుంటారా? అని నెటిజన్లు ఆల్రెడీ బెట్టింగులు కూడా కాసేసుకుంటున్నారు.
స్లోవక్ రిపబ్లిక్.. గూగుల్ మ్యాప్స్‌కు పండగ
ఈ టూర్ లో మోదీ షెడ్యూల్ చాలా బిజీ. జూన్ 13-14, 16-19 తేదీల్లో ఫ్రాన్స్ పర్యటన మధ్యలో ఆయన స్లోవక్ రిపబ్లిక్‌ను కూడా చుట్టేయనున్నారు. దీంతో ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. నిజానికి ఈ వార్త వచ్చే వరకు మన దేశంలో చాలా మందికి 'స్లోవక్ రిపబ్లిక్' అనే దేశం ఒకటి ఉందనే విషయమే తెలియదు. పాపం.. జనాలు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి "భయ్యా.. ఈ దేశం ఎక్కడుంది?" అని వెతికేలా చేయడంలో మన ప్రధాని రూటే సెపరేటు!
చివరిగా.. స్కోర్‌కార్డ్ రెడీ చేసుకోండి!
ప్రపంచం ఏమో యుద్ధాలు ఆగిపోతాయని, చమురు ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తోంది. కానీ సోషల్ మీడియా మాత్రం "ఎవరు ఎవరిని ఎంత రేంజ్‌లో పొగిడారు? ఎవరు ఎవరి భుజంపై ఎక్కువసేపు చేయి వేశారు?" అనే స్కోర్‌కార్డ్‌తో రెడీగా ఉంది.
చివరికి ఈ జీ7 భేటీ తర్వాత ప్రపంచ సమస్యలకు ఏమైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందా.. లేక ఇద్దరు నేతల చిరునవ్వులు, ఆలింగనాలతో కూడిన కొత్త ఫోటోలు 'ఎక్స్' లో ట్రెండ్ అయ్యే సరికొత్త సెల్ఫీలు మాత్రమే మిగులుతాయా అనేది చూడాలి. ఏదేమైనా ప్రపంచానికి మోక్షం దొరికినా దొరకకపోయినా.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి, మీమ్ పేజీలకు మాత్రం రాబోయే వారం రోజులు ఫుల్ మీల్స్ ఖాయం!
