Begin typing your search above and press return to search.

సంధి...జల సంధి- మోడీకి ట్రంప్ ఫోన్

అమెరికా పెద్దన్న హఠాత్తుగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఒక వైపు చూస్తే పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం ఉంది.

By:  Satya P   |   24 March 2026 11:41 PM IST
సంధి...జల సంధి- మోడీకి ట్రంప్ ఫోన్
X

అమెరికా పెద్దన్న హఠాత్తుగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఒక వైపు చూస్తే పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ కీలక సమయంలో తొలిసారిగా ట్రంప్ ఫోన్ చేసి మోడీతో మాట్లాడారు. ఈ ఇద్దరు నేతలు ఫోన్ లో ఏమి మాట్లాడుతున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రపంచాన్ని కుదిపేస్తున్న పశ్చిమాసియా యుద్ధం పరిస్థితులు చల్లార్చే ప్రయత్నం జరగాలని ఇరువురు నేతలు చర్చించారు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

హార్మోజ్ జలసంధి :

ఈ ఇద్దరు మాటలలో హార్మోజ్ జలసంధి ప్రస్తావన కీలకంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ జల సంధిని ఏ విధంగానైనా తెరిపించాలన్నది ఇద్దరి మాటగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఈ జల సంధి అందరికీ అందుబాటులో ఉంచడం అత్యవసరం అని నేతల మధ్య అభిప్రాయం వ్యక్తం అయినట్లుగా చెబుతున్నారు. ఆ జల సంధి కి రక్షణ అవసరం అని కూడా చర్చించారు అని అంటున్నారు.

భారత్ మద్దతు :

ఇదిలా ఉంటే ట్రంప్ తో తాను ఫోన్ లో మాట్లాడినట్లుగా ఎక్స్ వేదికగా మోడీ తెలిపారు. అంతే కాదు శాంతి, సుస్థిరత విషయంలో చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఉపయుక్తమైన చర్చ సాగిందని మోడీ చెప్పారు. ఇక పశ్చిమాసియాలో వీలైనత త్వరగా ఉద్రికతలను తగ్గించడం శాంతిని నెలకొల్పడం వంటి వాటి విషయంలో భారత్ సహకారం ఉంటుందని ట్రంప్ తో అన్నట్లుగా మోడీ చెప్పారు.

చర్చలు దౌత్యం :

అంతకు ముందు రాజ్యసభలో మోడీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మీద కీలక ప్రకటన చేశారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై గల్ఫ్ దేశాల నాయకులతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్లు తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకాలు కలిగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. యుద్ధ వాతావరణంలో కూడా భారత నౌకల సురక్షిత రాకపోకల కోసం దౌత్య మార్గం ద్వారా భారతదేశం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. పశ్చిమ ఆసియాలో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని రాజ్యసభకు తెలిపారు.

భారత్ కీలకంగా :

ఒక వైపు ఇరాన్ తో భారత్ మాట్లాడుతోంది. మరో వైపు అమెరికా ప్రెసిడెంట్ కూడా మోడీతో ఫోన్ కలిపారు. ఈ నేపధ్యంలో భారత్ ఇపుడు కీలకంగా మారుతోంది అని అంటున్నారు. ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటనను చూస్తే కనుక దౌత్యం చర్చలే సమస్యలకు పరిష్కారం అని అన్నారు దాంతో చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలుకుతారా అన్నది అయితే అంతా చూస్తున్నారు. మరి ఇరాన్ ఏ విధంగా వెనక్కి తగ్గుతుంది, అమెరికా ఏమి చేయాలి, భారత్ సలహా సూచనలు ఏమిటి అన్నది ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు మొత్తానికి అంతర్జాతీయంగా చూస్తే భారత్ ప్రాముఖ్యత అయితే బాగా పెరిగింది అని ట్రంప్ ఫోన్ కాల్ తెలియచేస్తోంది అంటున్నారు.