Begin typing your search above and press return to search.

మోడీ-పుతిన్ సమావేశం : తీసుకున్న నిర్ణయాలు.. ప్రకటనలు.. ఏం జరిగిందంటే?

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తున్నారు ప్రధాని మోడీ.

By:  A.N.Kumar   |   5 Dec 2025 6:51 PM IST
మోడీ-పుతిన్ సమావేశం : తీసుకున్న నిర్ణయాలు.. ప్రకటనలు.. ఏం జరిగిందంటే?
X

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తున్నారు ప్రధాని మోడీ. నిన్న రాత్రి స్వయంగా స్వాగతించినప్పటి నుంచి మోడీని ఎంతో ఆప్యాయంగా.. అనురాగంగా చూసుకుంటున్నారు. ఈ రోజు భారత్-రష్యా ల మధ్య కీలకమైన ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా అమెరికాకు చెక్ పెట్టేలా మోడీ, పుతిన్ స్కెచ్ వేశారు. అమెరికాకు గట్టి షాక్ ఇచ్చారు. అమెరికా వాణిజ్య ఒత్తుడులు ఎదురైతువుతున్నప్పటికీ భారత్ రష్యా ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులును భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు.

ఇక భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఎప్పటికీ తగ్గలేదు. పైగా అమెరికా ఆంక్షల వేళ మరింత పెరగడం విశేషం. వాణిజ్యం 12 శాతం పెరిగి రికార్డ్ సృష్టించిందని పుతిన్ విలేకరుల సమావేశంలో పేర్కొని అమెరికాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇక నుంచి ఈ ఏడాది మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఏకంగా 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.

ఇక అమెరికన్ డాలర్ పై ఆధారపడకుండా భారత్ -రష్యా క్రమంగా చెల్లింపుల కోసం తమ జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా కదులుతాయని.. దాదాపు 96 శాతం వాణిజ్య చెల్లింపులను జాతీయ కరెన్సీల్లోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని డాలర్ పెత్తనానికి చెక్ పెట్టారు.

ఇక మోడీ స్పష్టంగా ఇరు దేశాలు ఉగ్రవాదం పై పోరుకు కలిసి నడుస్తాయని పేర్కొని శత్రుదేశం పాకిస్తాన్ కు చెక్ పెట్టారు. మీడియా సమావేశంలో మోడీ ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడికి.. గత ఏడాది రష్యాలోని మాస్కో లోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్ పై జరిగిన దాడికి మూలం ఉగ్రవాదం అంటూ దానిపై ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా భారత్, రష్యా ఏకమైనట్టు ప్రకటించి సంచలన ప్రకటన చేశారు.

ఉక్రెయిన్ యుద్ధంపై కూడా మోడీ కీలక ప్రకటన చేశారు. తాము ఏ పక్షం వహించమని.. శాంతిపక్షాన నిలుస్తామంటూ మోడీ స్పష్టం చేశారు. చర్చలు, శాంతియుతంగానే ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తీసుకోవాలని భారత్ తరుపున మోడీ ఆకాంక్షించారు. దేశాల సంక్షేమం, శాంతి ముఖ్యమన్నారు. ప్రపంచం శాంతి దిశగా తిరిగి రావాలని మోడీ ఆకాంక్షించారు.

ఇక పుతిన్ మాట్లాడుతూ.. మోడీ తనకు ఇచ్చిన గౌరవం, ఆత్మీయ స్వాగతం మరిచిపోలేని.. కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు దేశాల బంధం దశాబ్ధాలుగా ఉందని.. ముందుకు సాగుతుందని.. పుతిన్ హామీ ఇచ్చారు.

ఇక పలు, రక్షణ, అంతరిక్ష, కీలక ఒప్పందాలను రెండు దేశాలు చేసుకోవడం విశేషం.