బీహార్ ఎఫెక్ట్: ఉద్యోగులు-రైతులపై మోడీ ప్రేమ!
ఎన్నికలు వస్తే తప్ప.. నాయకులకు ప్రజలు కనిపించరన్న విమర్శ ఉంది. దీనికి అతీతంగా ఎవరూ కని పించకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
By: Garuda Media | 29 Oct 2025 12:00 PM ISTఎన్నికలు వస్తే తప్ప.. నాయకులకు ప్రజలు కనిపించరన్న విమర్శ ఉంది. దీనికి అతీతంగా ఎవరూ కనిపించకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి ముసురుకుంది. 243 స్థానాలకు రెండు దశల్లో జరుగుతున్న ఎన్నికలు నవంబరు 9, 11 తేదీల్లో నిర్వహించనున్నా రు. ఇది దేశరాజకీయాలను కీలకమలుపు తిప్పుతుందన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ని ఎన్డీయే కూటమి, ఇండీ కూటమిలుఈ ఎన్నికలను ప్రాణప్రదంగా భావిస్తున్నాయి.
అయితే.. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. హామీలు మాత్రమే ఇచ్చేందుకు పార్టీలకు అవకా శం ఉంటుంది. కానీ ఈ హామీలతో కూడా ఇప్పుడు పని అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులు.. రైతులపై ఎనలేని ప్రేమను కురిపిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలానే.. రైతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పోషక విలువల ఆధారిత ఎరువుల విషయంలో భారీ రాయితీలు ప్రకటించింది. రైతులకు సబ్సిడీ, సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువుల లభ్యతకు ఇది మార్గం సుగమం చేయనుంది. అంతర్జాతీయంగా ఎరువులు, ఇన్‌పుట్‌ల ధరలలో ఇటీవలి ధోరణుల దృష్ట్యా ఎరువులపై సబ్సిడీని హేతుబద్ధీకరించినట్టు చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఈ వ్యవహారం బీహార్ ఎన్నికల చుట్టూ తిరుగుతుండడం గమనార్హం.
