దళపతి విజయ్ గెలుపు -మోడీ కూడా హ్యాపీ నా ?
తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఆయన పార్టీ ఓడిపోవడమే కాదు ఏకంగా తాను పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ ఓటమి పాలయ్యారు.
By: Satya P | 4 May 2026 10:50 PM ISTతమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఆయన పార్టీ ఓడిపోవడమే కాదు ఏకంగా తాను పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన పరాజయాన్ని అందుకున్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా అనేక ఎన్నికల్లో పోటీ చేసిన స్టాలిన్ సీఎం హోదాలో ఓటమి పాలు కావడం ఇదే తొలిసారి. దాంతో డీఎంకే శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఇక స్టాలిన్ ఓడించింది టీవీకే అభ్యర్థి కావడం మరింత విశేషం. దాంతో విజయ్ సునామీ ఏ తీరుగా ఉందో అందరికీ అర్థం అవుతోంది కదా.
మోడీ గ్రీటింగ్స్ :
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ సాధించిన ఘన విజయాలను కార్యకర్తలతో కలసి పంచుకుని అనందించారు. ఇక బీజేపీ గెలవని ఎన్డీయే కూటమికి దక్కని తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద కూడా మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన దళపతి విజయ్ ని మెచ్చుకున్నారు. టీవీకే అద్భుతమైన పనితీరుని కనబరచింది అని మోడీ ప్రశంసించడం విశేషం. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కూడా మోడీ హామీ ఇచ్చారు. ఎన్డీయే ఓటమి పాలు అయినా స్టాలిన్ మరోసారి గెలవకపోవడం బీజేపీకి ఆనందంగానే ఉందని అంటున్నారు.
అపరిమితమైన సంతోషం :
ఇక మోడీ అయిదు రాష్ట్రాల ఎన్నికల మీద ట్వీట్లు చేసూ తన భావాలను పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో 2026 లో జరిగిన ఎన్నికలు ఆ మీదట వచ్చిన ఫలితాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ ఓటమి పాలు కావడం బీజేపీకి పట్టరాని ఆనందాన్ని ఇస్తోంది. అదే సమయంలో చీటికీ మాటికీ కేంద్రం మీద విమర్శలు చేస్తూ మోడీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమి పాలు కావడం ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం బీజేపీకి ఇంకా ఎక్కువ ఆనందగా ఉందని అంటున్నారు. అందుకే టీవీకే విజయం మోడీకి బీజేపీకి ఎంతో హ్యాపీగా మారిందని అంటున్నారు.
దగ్గరకు తీస్తారా :
ఇక తమిళనాడులో ద్రవిడ పార్టీల శకం దాదాపుగా ముగిసినట్లే అని అంటున్నారు. దాంతో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వచ్చిన విజయ్ తొలి ప్రయత్నంలోనే అధికారం అందుకోబోతున్నారు. దాంతో ఆయనకు మోడీ స్వయంగా అభినందనలు చెప్పడం వెనక వ్యూహాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే తమిళనాడులో పట్టు సాధించాలని బీజేపీ చూస్తోంది. విజయ్ పార్టీకి అన్నా డీఎంకే మద్దతు ని ఇవ్వడం ద్వారా ప్రభుత్వంలో భాగం అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద విజయ్ ని గ్రీట్ చేస్తూ మోడీ చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున చర్చకు అవకాశం ఇస్తోంది అని అంటున్నారు.
