Begin typing your search above and press return to search.

మళ్ళీ మోడీయేనట....మరో ఇరవై బీజేపీకి !

దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు అని ఒక అంచనా వెల్లడించింది ఈ అంచనాను కట్టింది ఇండియా టుడే సీ ఓటర్.

By:  Satya P   |   29 Aug 2025 9:07 AM IST
మళ్ళీ మోడీయేనట....మరో ఇరవై బీజేపీకి !
X

దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు అని ఒక అంచనా వెల్లడించింది ఈ అంచనాను కట్టింది ఇండియా టుడే సీ ఓటర్. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసిన సర్వేలో ఈ రకమైన అంచనా వచ్చినట్లుగా ఇండియా టుడే వెల్లడించింది. ఇపుడే ఎన్నికలు జరిగితే బీజేపీకి 260 ఎంపీ సీట్లు సొంతంగా వస్తాయని అలాగే ఎన్డీయే కూటమికి 324 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది.

ఇండియా కూటమికి ఎన్ని సీట్లు :

ఇక ఈ సర్వే ద్వారా ఇండియా టుడే వేసిన అంచనా ఏమిటి అంటే ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని. ఇక 2024లో చూస్తే బీజేపీకి 240 సీట్లు వస్తే ఇపుడు ఆ సంఖ్య 260కి పెరుగుతుందని వెల్లడించింది. అంటే మరో ఇరవై సీట్లు ఏణ్ణర్థం కూడా కాకుండానే పెరుగుతుందని ఈ సర్వే అంచనాగా ఉంది అన్న మాట.

ఆ రాష్ట్రాలలో కమల వికాసం :

ఇక దేశంలోని లోక్ సభ ఎన్నికల తరువాత వరసగా మూడు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా విజయాలు సాధించిన ఎన్డీయే ఇపుడు కనుక లోక్‌సభ ఎన్నికలు జరిగితే తన ఆధిపత్య ప్రదర్శనను ప్రదర్శించి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టంగా చెబుతోంది. అలాగీఅ 2024లో 234 సీట్లు గెలుచుకుని ఎన్డీయేకి బాగా దెబ్బ తీసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి నేడు ఎన్నికలు జరిగితే 208కి తగ్గుతుందని అంచనా వేయడం మీద చర్చ జరుగుతోంది.

ఈ తేదీలలో సర్వే :

ఇక చూస్తే కనుక ఇండియా టుడే-సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14న మధ్యన నిరహించింది అలా అన్ని లోక్‌సభ స్థానాలలోని 54,788 మంది వ్యక్తులను ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చేసింది. వీటికి అదనంగా ఒక లక్షా 52 వేల 38 మందిని ఇంటర్వ్యూలను కూడా చేసి వారి అభిప్రాయలాను విశ్లేషించారు. ఇక ఎన్ డీయే ఓట్ల శాతం చూస్తే 46.7 గా పేర్కొన్నారు. ఇది 2024లో వచ్చిన 44 శాతం కంటే పెరిగింది అని అంటున్నారు. అలాగే ఇండియా కూటమికి 40.9 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.

ఉత్తరాదిన పెరిగిన బలం :

ఇక ఉత్తరాదిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ బీజేపీకి బలం పెరిగింది అని సర్వే చెబుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది అని అంచనా వేస్తోంది. చూడాలి మరి ఈ సర్వే అంచనాలు ఏ విధంగా బీహార్ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయో.