Begin typing your search above and press return to search.

మోడీ సంధించిన బాణం...వారి మీదకేనా ?

ప్రధాని నరేంద్ర మోడీ మంచి ఉపన్యాసకుడు. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు.

By:  Satya P   |   21 Oct 2026 9:09 AM IST
మోడీ సంధించిన బాణం...వారి మీదకేనా ?
X

ప్రధాని నరేంద్ర మోడీ మంచి ఉపన్యాసకుడు. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. ఆయన వర్తమాన అంశాలను సందర్భానుసారం ఆయా వేదిక మీద పరోక్షంగా జత చేస్తూ ఎవరిని ఎక్కడ గురి పెట్టి బాణాలు సంధించాలో బాగా తెలిసిన నాయకుడు. అందుకే ఆయన విజయదశమి వేళ కూడా తన ప్రసంగంలో కూడా చురకలు అంటించారు. ఎవరికి ఏవి తగలలో బాగానే వేశారు అని అంటున్నారు దేశంలోని శత్రువులను ఓడించాలని మోడీ ఇచ్చిన పిలులు వెనక లోతైన భావాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న అనేక అంశాలను దృష్టిలో ఉంచుకునే మోడీ ఈ సీరియస్ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

దేశమే ప్రథమం అంటూ :

మొదట దేశమే ఫస్ట్ అని మోడీ ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ గౌరవానికి భంగం కలిగించే శక్తులను అలాగే సమాజాన్ని దేశ గౌరవానికి భంగం కలిగించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, భారతీయ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగిన వారే దేశ శత్రువులని నరేంద్ర మోడీ అభివర్ణించారు. వారినే ఓడించమని పిలుపు ఇచ్చారు. భారతీయతను తక్కువ చేసే వారిని అలాగే విచ్చిన్నకర శక్తులను దూరం పెట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.

రాముడే ఆదర్శం :

మన పూర్వీకులు వేల ఏళ్ళుగా శ్రీరాముడిని పూజిస్తున్నారు అని మోడీ గుర్తు చేశారు. దానికి కారణం శ్రీరాముడు ఆదర్శాలే అని మోడీ చెప్పారు. రామరాజ్యమే ఈ రోజుకీ సుపరిపాలనకు ప్రమాణంగా మోడీ చెప్పారు. ఎవరి పట్ల వివక్ష తేడాలు చూపించకుండా అందరికీ న్యాయం సమాన అవకాశాలు అందించడం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారం ఉండటమే రామరాజ్యమని ప్రధాని వివరించారు. రాముడి బాటలో అంతా నడవాలని ఆయన సూచించారు. రాముడు ఎపుడూ గట్టి సంకల్పం వీడలేదని మోడీ గుర్తు చేశారు.

భారత మాతకు శతృవులు :

దేశాన్ని దెబ్బ తీసే వారు భారత మాత శత్రువులే అని మోడీ స్పష్టం చేశారు. దేశ గౌరవం అందరిదీ అని ఆయన అంటూ దానికి విఘాతం కలిగించే శక్తులు దేశ సంస్కృతి మూలాలనే ప్రశ్నించి ద్వేషించే వారే అసలైన విఘాతకులు అని ఆయన అన్నారు. వారిని ధీటుగా దేశ ప్రజలు అంతా ఎదుర్కోవాలని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. రెండే మంత్రాలు లక్ష్యాలు జనం మదిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ రోజున భారత్ ముందు వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అన్న రెండే లక్ష్యాలు ఉన్నాయని నరేంద్ర మోడీ అంటూ వాటిని నెరవేర్చే కర్తవ్యాన్ని ప్రతీ పౌరుడు తీసుకోవాలని మోడీ కోరారు.

పరోక్షంగానే :

ఈ రోజున దేశంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే మోడీ ఈ వ్యాఖ్యలు చేసారు అని అంటున్నారు. దేశ గౌరవం తగ్గిస్తే సహించేది లేదని ఆయన ఒక బలమైన సందేశం పంపించారు అని అంటున్నారు. అలాగే భారతీయత మీద ద్వేషం పెంచుకున్న శక్తులు అని కూడా ఆయన అన్నారు. వారెవరో జనాలకు తెలుసు అన్నట్లుగా చెబుతూ వారిని ఓడించాలని నేరుగానే పిలుపు ఇచ్చారు.

ఆర్ఎస్ఎస్ నినాదం :

మరో వైపు ఆర్ఎస్ఎస్ 101 ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దేశాన్ని ముక్కలు చేయాలని చూసే శక్తుల ఆగడాలు చెల్లవని హెచ్చరించారు. భారత్ విషయంలో ఫ్రాన్స్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో జరిగిన అల్లర్లు, అలజడులను ప్రస్తావిస్తూ పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఈ రకమైన భావజాలం వ్యవస్థలను, మానవీయ విలువలను నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇలాంటి శక్తులకు భారతదేశమే అసలు లక్ష్యమని భారత్‌ను హిందూ సమాజాన్ని, ఆరెస్సెస్‌ను బలహీనపరిచేందుకు అంతర్జాతీయంగా కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. మొత్తం మీద భారత్ మీద కుట్రలు జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆరోపిస్తూంటే భారత్ ని వ్యతిరేకించే శక్తులు అని మోడీ చెప్పడం విశేషం.