Begin typing your search above and press return to search.

రేవంత్ ని మోడీ ఇరికించేశారా ?

ప్రధాని నరేంద్ర మోడీ బహు చమత్కారి. అంతకు మించి అపర రాజకీయ చాణక్యుడు.

By:  Satya P   |   12 May 2026 6:00 AM IST
రేవంత్ ని మోడీ ఇరికించేశారా ?
X

ప్రధాని నరేంద్ర మోడీ బహు చమత్కారి. అంతకు మించి అపర రాజకీయ చాణక్యుడు. ఆయన ఏమి మాట్లాడినా అందులో అనేక అర్థాలు లక్ష్యాలు ఉంటాయి. ఇక అదే తీరున మోడీ అన్న ఒక మాట అయితే తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బాగా ఇరకాటంలో పెట్టేసినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా చేసిన తెలంగాణా పర్యటనలో అనేక ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి.

వారిద్దరి ఇళ్లకూ నేరుగా :

ఇక చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి నరేంద్ర మోడీ వెళ్లి గంటసేపు పైగా ఆయనతో చర్చించడం ఆసక్తిని రేపింది. అంతే కాదు బాబు కుటుంబ సభ్యులతో సైతం నరేంద్ర మోడీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా సేపు గడిపారు. అదే సమయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా నరేంద్ర మోడీ వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి కూడా మోడీ వాకబు చేసి ఆయన్ని పరామర్శించారు. ఈ విషయాలు ఒక వైపు చర్చలో ఉండగానే మరో వ్యక్తి కీలకమైన విష యం మీద కూడా చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

రాజకీయ రచ్చగా :

నిజానికి అది చర్చ అనే దానికంటే రాజకీయ రచ్చ అనడం బెటర్. ఎలా అంటే ప్రధానమంత్రి తో కలిసి తెలంగాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు గుజరాత్ కి ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్న మనోహర్ సింగ్ ఎంతో సహాయం చేశారని మో|డీకి గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉదారంగా రాజకీయ వివక్షకు తావు లేకుండా కేంద్రం సహాయం చేయాలని మోడీని రేవంత్ రెడ్డి కోరారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు సహాయం కోరుకోవడం సహజం. సమాఖ్య వ్యవస్థలో ఇది అతి ముఖ్యమైన విషయం. కేంద్రం రాజకీయాలకతీతంగా అన్ని రాష్ట్రాలను సమాదరించాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టుగానే రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కూడా ఉంది.

మోడీ భారీ ఆఫర్ :

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తమతో కలిస్తే ఆయన అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరని చమత్కరించారు. రేవంత్ రెడ్డి తమతో కలవాలి అన్న మాటలు పట్టుకుని రాజకీయంగా చిలవలు పలవలూ చేసి ఎవరికి తోచిన తీరిన వాళ్ళు రాజకీయంగా విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి బిజెపికి చెందిన అగ్ర శ్రేణి నాయకుడు. ఇక బీజేపీ వర్తమాన రాజకీయ వ్యూహాలు చూస్తే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులను బిజెపి నేరుగా చేర్చుకుని వారికి రాజకీయ పదోన్నతి కల్పిస్తోంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తాజాగా పశ్చిమబెంగాల్ లో సురేందర్ అధికారి ఈ జాబితాలో ఉన్నవారే. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కి ఊపిరి పోసిన అతి ముఖ్య నేతగా కూడా ఉన్నారు. దాంతో ప్రధానమంత్రి మాట్లాడింది రాజకీయంగానా లేక అభివృద్ధి పరంగానా అన్న చర్చ ఎడతెరిపి లేకుండా ప్రస్తుతం తెలంగాణా అంతటా సాగుతోంది.

అభివృద్ధి కోణంలోనే

అయితే దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్న మాటలను పట్టుకుని ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి అభివృద్ధి కోణంలోనే మాట్లాడాలని రాష్ట్ర అభివృద్ధి కోసం తాను చేసిన విజ్ఞప్తిని ఆయన అదే తీరుగా జవాబు ఇచ్చారని రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలకు అర్ధాలే వేరులే అన్నది కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎక్కడ కాంగ్రెస్ కి బలమైన నాయకులు ఉన్నారో చూసి మరీ అక్కడ చూసి వారికి ఎర వేసి సి తనవైపు చేర్చుకోవడం బిజెపి అనుసరిస్తున్న నయా రాజకీయ వ్యూహంగా ఉంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కి కూడా బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతుంది అయితే తాను నరేంద్ర మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా ఎదిగిన నాయకుడిని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ మధ్య చర్చ జరిగిందని మోడీ సైతం అలాగే మాట్లాడారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఈ రాజకీయ రచ్చ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇంతకీ దీని మీద క్లారిఫికేషన్ తెలంగాణా బిజెపి నేతలు నుంచి వస్తుందా అంటే ఏమో చెప్పలేం ఎందుకంటే ఇరకాటంలో పడింది రేవంత్ రెడ్డి. అందుకే బీజేపీ నేతలు గమ్మున ఉన్నారని అంటున్నారు. ఇక నరేంద్ర మోడీ మాత్రం తెలంగాణ పర్యటనలో రేవంత్ రెడ్డి ని పూర్తిగా ఇరకాటంలో పెట్టేసినట్టుగా ఉందని అంటున్నారు.