ఆమె 'ఆత్మకథ'కు మోదీ ముందుమాట... ప్రతి ఒక్కరి మనసులో మాట
ప్రజాకర్షణ వంటి కొన్ని విషయాల్లో వీరి మధ్య సారూప్యతలు ఉండడం గమనార్హం. అందుకే ఎక్కడ కలిసినా పాత స్నేహితుల్లా నవ్వుతూ కనిపిస్తుంటారు. పరస్పరం ‘కితాబు’లు ఇచ్చుకుంటారు.
By: Tupaki Political Desk | 29 Sept 2025 2:30 PM ISTకొన్ని స్నేహాలు.. కలయికలు.. చిరకాలం గుర్తుంటాయి.. చరిత్రలో నిలిచిపోతాయి..! ఈ ఇద్దరు నాయకుల విషయంలోనూ ఇదే జరుగుతోంది...! భారత ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. గురించే ఇదంతా..! ప్రధానుల స్థాయిలో ఓ సమావేశంలో కలుసుకున్న వీరు స్నేహితులుగా మారిపోయారు. ప్రజాకర్షణ వంటి కొన్ని విషయాల్లో వీరి మధ్య సారూప్యతలు ఉండడం గమనార్హం. అందుకే ఎక్కడ కలిసినా పాత స్నేహితుల్లా నవ్వుతూ కనిపిస్తుంటారు. పరస్పరం ‘కితాబు’లు ఇచ్చుకుంటారు.
జీ-7 నుంచి కలిసి మెలిసి
ప్రధానిగా 11 ఏళ్లలో దాదాపు 80 దేశాలలో పలుసార్లు పర్యటించిన మోదీ అంతర్జాతీయంగా పలువురు అధ్యక్షులు, ప్రధానులను మంచి స్నేహితులుగా చేసుకున్నారు. ఆయా దేశాలతో దౌత్య, రక్షణ సంబంధాలను పటిష్ఠం చేశారు.
వీరిలో అందరికంటే ఆత్మీయురాలుగా మారారు మెలోనీ. వీరిద్దరి పరిచయం అగ్ర రాజ్యాల గ్రూప్ అయిన గ్రూప్ 7 (జీ-7) సందర్భంగా సమావేశం సందర్భంగా మోదీ-మెలోనీ కలుసుకున్నారు. అప్పుడు వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పలు అంతర్జాతీయ వేదికలపై కలుసుకున్నా ఇదే రీతిలో కెమెరాలు క్లిక్ మన్నాయి.
ఇటలీ ప్రధానికి మోదీ ‘కితాబు’
ఇటలీ ప్రధాని మెలోనీ ఆత్మకథ పేరు ఐ యామ్ జార్జియా-మై రూట్స్ -మై ప్రిన్సిపుల్స్. దీనికి భారత ప్రధాని మోదీ ముందుమాట రాశారు. ఈ పుసక్తం ఇండియన్ ఎడిషన్ త్వరలో భారత మార్కెట్ లోకి రానుంది. దీనిని ప్రతి ఒక్కరి మనసులో మాట (హర్ మన్ కీ బాత్) అంటూ మోదీ అభివర్ణించడం గమనార్హం. ఆదివారాల్లో మన్ కీ బాత్ అంటూ మోదీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టి దేశ ప్రజలను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ప్రతి ఒక్కరి మనసులో మాట అంటూ మెలోనీ పుస్తకానికి కితాబునిచ్చారు. ఈ పుస్తకానికి ముందుమాట రాయడం తనకు దక్కిన గౌరవంగానూ అభివర్ణించారు. మెలోనీ జీవితం, నాయకత్వం కాలాతీతం అని పేర్కొన్నారు. భారత్-ఇటలీ మధ్య చాలా అంశాల్లో సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. మెలోనీ జీవిత కథను భారతీయులు ఆదరిస్తారన్న నమ్మకం వ్యక్తం చేశారు.
-మెలోనీ పుస్తకం రియల్ వెర్షన్ నాలుగేళ్ల కిందటే విడుదలై.. బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. విచిత్రం ఏమంటే ఆమె అప్పట్లో ఇటలీ ప్రతిపక్ష నేత. ఈ ఏడాది జూన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు.
-మెలోనీ వివాహం చేసుకోకుండానే తల్లి అయ్యారు. ఆ ఇబ్బందులను తన పుస్తకంలో ఆమె ప్రస్తావించారు. గర్భంతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
-ఇక మోలోదీ (శ్రావ్యమైన సంగీతం) అని ఎందుకు వచ్చిందంటే.. మెలోనీ+మోదీ నుంచి వచ్చింది. యూఏఈలో కొన్నేళ్ల కిందట కాప్-28 సదస్సు జరిగింది. అప్పుడు ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. మెలోదీ అనే హ్యాష్ ట్యాగ్ తో మెలోనీ దానిని అప్పటి ట్విటర్ లో పెట్టారు. అప్పటినుంచి #Melodi అనే పదం పెద్ద ట్రెండ్ అయ్యింది. కాగా, తొలిసారి వీరిద్దరూ దిగిన ఫొటోపై మోదీ కూడా స్పందించారు. స్నేహితులను కలవడం ఎప్పుడూ సంతోషకరమే అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇటలీ, కెనడాల్లో జీ7 సదస్సులు జరగ్గా మెలోదీ కనిపించింది.
