ప్రపంచానికి 4 నియమాలు.. మోడీ సూత్రీకరణ!
ప్రపంచ దేశాలకు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు నియమాలను సూత్రీకరించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు ఆదివారం ఆయన ప్రసంగించారు.
By: Garuda Media | 14 Sept 2026 10:04 AM ISTప్రపంచ దేశాలకు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు నియమాలను సూత్రీకరించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు ఆదివారం ఆయన ప్రసంగించారు. శనివారం ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాలు తీసుకున్న నిర్ణయాలు అభివృద్ది చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని మోడీ పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన 4 అంశాలను నొక్కి చెప్పారు.
1) స్థితిస్థాపకత.
2) ఆవిష్కరణలు.
3) సహకారం.
4) సుస్థిరత.
అనేవి మూలస్తంభాలుగా పేర్కొన్నారు.
ఈ నాలుగు అంశాలను సాకారం చేసేందుకు బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు, మద్దతు తెలిపే దేశాల సహకారం. మద్దతు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి దృక్పథం అందరికీ ప్రయోజనకరంగా మారుతుం దని ఆశిస్తున్నట్టు తెలిపారు. బ్రిక్స్ వేదికగా దేశాల గొంతుక వినిపిస్తోందని, ప్రతి ఒక్కరి అనుభవాలకు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. బ్రిక్స్ వేదికగా తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల.. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.
బ్రిక్స్ వేదికగా భారత దేశం ప్రపంచ దేశాలతో ముఖ్యంగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో స్నేహం, భాగస్వామ్యం, సహకార స్ఫూర్తిని పెంపొందించిందని ప్రధాన మంత్రి తెలిపారు. బ్రిక్స్ దేశాల సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సాధారణ పౌరులు కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆ మేరకు బ్రిక్స్ తీర్మానం ప్రతిఫలిస్తుందని ప్రధాని వివరించారు.
అయితే.. చిత్రం ఏంటంటే.. ప్రధాని ప్రతిపాదించిన ఈ నాలుగు నియమాలను పాటించే దేశాలు ఎన్ని? అనేదే ప్రశ్న. ఎందుకంటే.. ఆవిష్కరణల పరంగా అయినా.. స్థితిస్థాపకత విషయంలో అయినా.. ప్రస్తుతం పరస్పర సహకారం మిన్నగా లేదన్నది వాస్తవం. ఇక, సుస్థిరత విషయం మేడిపండుగా మారింది. పైకి ఎంత చెబుతున్నా.. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి అందరికీ తెలిసిందే. ఇలా.. ప్రధాని మోడీ ప్రస్తావించిన నాలుగు అంశాలు కూడా.. పాటించడం అంత ఈజీకాదన్నది నిపుణులు చెబుతున్న మాట.
