జస్ట్ టైమ్ మ్యాజిక్ : నాడు పుతిన్ వెనకన...నేడు సరసన
కాలం చేసే మ్యాజిక్ ఇది. ఎవరు ఎపుడు ఏమి అవుతారో కాలమే డిసైడ్ చేస్తుంది. ఆ టైమ్ చేసే తమాషా ముందు ఎవరి పాత్ర ఏమిటో తెలుస్తుంది.
By: Satya P | 4 Dec 2025 11:56 PM ISTకాలం చేసే మ్యాజిక్ ఇది. ఎవరు ఎపుడు ఏమి అవుతారో కాలమే డిసైడ్ చేస్తుంది. ఆ టైమ్ చేసే తమాషా ముందు ఎవరి పాత్ర ఏమిటో తెలుస్తుంది. ఒకనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆనాటి ప్రధానమంత్రి వాజ్ పేయి తో కలసి రష్యా టూర్ కి వెళ్ళారు. ఇది సరిగ్గా 2001లో జరిగిన ఘటన. అప్పటికే రష్యా అధిపతిగా పుతిన్ ఉన్నారు. అలా వాజ్ పేయి పుతిన్ ఇద్దరూ మాస్కోలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొంటే వాజ్ పేయి కి పుతిన్ కి వెనకన గుజరాత్ సీఎం హోదాలో నరేంద్ర మోడీ నిలబడ్డారు. ఆయన పక్కన ఆనాటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ కూడా ఉన్నారు. ఇది జరిగి ఏకంగా రెండున్నర దశాబ్దాల కాలం అయింది.
సోషల్ మీడియాలో వైరల్ :
సరిగ్గా పుతిన్ భారత్ లో అడుగుపెడుతున్న వేళ ఈ ఇద్దరు అగ్ర నేతల పాత చిత్రాలు సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆనాటి పాత ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆనాడు వాజ్ పేయి తో కలసి మోడీ మాస్కో సందర్శించారు. అంతే కాదు ఆ పర్యటనలో భాగంగా గుజరాత్ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం మధ్య పెట్రోకెమికల్స్, హైడ్రోకార్బన్లు, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, పర్యాటకం సంస్కృతిలో సహకారాన్ని పెంపొందించడానికి మోడీ ఒక ప్రోటోకాల్ ఒప్పందంపై రష్యాతో అప్పట్లో సంతకం చేశారు. అంతే కాదు ఇదే పర్యటనలో మాస్కోలోని ఇస్కాన్ ఆలయాన్ని కూడా మోడీ ఆ సమయంలో సందర్శించారు. ఈ పర్యటన ముఖ్యమంత్రిగా మోడీ తొలి అంతర్జాతీయ టూర్ గా నమోదు అయింది. అంతే కాదు రష్యా అధినేత పుతిన్‌తో ఆయన తొలి దౌత్య బంధంగా సైతం అంతా చూస్తున్నారు.
ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ :
అయితే 2001 తరువాత మరో పదమూడేళ్ళకు మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తిరుగులేని నేతగా ఎదిగారు. అంతే కాదు బ్రహ్మాండమైన మెజారిటీతో 2014లో దేశానికే ప్రధాని అయ్యారు. గతంలో రష్యా టూర్ సందర్భంగా మోడీ కూడా పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా పుతిన్ తనకు ఏ మాత్రం తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆయన అప్పట్లో చెప్పుకున్నారు. ఆయన అభిమానం స్నేహం నాటి నుంచే కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.
కెమిస్ట్రీ అదుర్స్ :
ప్రపంచ నేతలు అందరితోనూ మోడీ సమావేశం అవుతూంటారు. ఆప్యాయంగా వారితో కలసి భేటీలు వేస్తారు. కానీ పుతిన్ మోడీల మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ అయితే కుదిరింది అని అంతా అంటారు. ఈ ఇద్దరు నేతలు కలిస్తే గొప్ప స్నేహితుల మధ్య అనుబంధం కనిపిస్తుంది. అందులో సహజమైన ప్రేమాభిమానాలు కూడా కనిపిస్తాయి. ఇక భారత్ కి తాజాగా వచ్చిన పుతిన్ కోసం ఏకంగా ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మోడీ ఆయనకు ఎదురేగి స్వాగతం పలకడం అంటే గ్రేట్ అనే చెప్పాల్సిందే.
